40.2 C
Hyderabad
May 2, 2024 18: 14 PM
Slider నిజామాబాద్

హైటెన్షన్: కామారెడ్డి రైతుల ధర్నా నేపథ్యంలో పోలీసు పహారా

#kamareddy

కామారెడ్డిలో మళ్ళీ హైటెన్షన్ నెలకొంది. నెల రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలు నేటితో మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో మున్సిపల్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దాంతో ఉదయాన్నే పోలీసులు కొందరు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. దాంతో రైతులను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే మున్సిపల్ ముందు రైతుల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన అల్లర్లు, దాడులు, ఉద్రిక్త పరిస్తుతులను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అలాంటి ఘటనలు మున్సిపల్ కార్యాలయం వద్ద పునరావృతం కాకుండా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. మున్సిపల్ కార్యాలయంలోకి రైతులు రాకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ వద్దకు ఒక్కొక్కరుగా రైతులు వచ్చి చేరుకుంటున్నారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా ఉన్న నేపథ్యంలో కామారెడ్డిలో మళ్ళీ ఎలాంటి పరిస్తుతుల నెలకొంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రైతులు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నారు. ఎలాంటి టెంటు, కార్పెట్లు లేకుండా రైతులు కిందనే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కామారెడ్డిలో ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.

మున్సిపల్ ముందు బైఠాయించిన రైతులు

Related posts

వైసిపి పాలనతో రాష్ట్రం బ్రష్టు పట్టిపోయింది

Bhavani

సుప్రీం కోర్టు లో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

జర్నలిస్టులకు అండగా ఉంటాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment