26.7 C
Hyderabad
May 3, 2024 10: 34 AM
Slider పశ్చిమగోదావరి

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

#hindi

తెలుగు భాషలో పాటు హిందీ భాష లో కూడా ప్రతి ఒక్కరు ప్రావీణ్యం కలిగి ఉండాలని విజయవాడ కె బి ఎన్ కళాశాల హిందీ అధ్యాపకురాలు కె జానకి అన్నారు. ఏలూరు సర్ సి ఆర్ ఆర్ కళాశాలలో మంగళ వారం హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాచ్య భాషా విభాగం వారు నిర్వహించిన దొహో మే  అభివ్యక్త్ మానవ మూల్య అనే అంశం పై జానకి మాట్లాడారు. హిందీ సాహిత్యం లో మానవ విలువలు నైతిక విలువలు పెంపొందించుకొనే తీరును పద్యాల ద్వారా భావాల తో వివరిస్తూ విద్యార్థుల్లో   హిందీ పట్ల  ఆసక్తి పెరిగేలా వచ్చే మార్పు తో బాటు సమాజం లో హిందీ భాష వాడుక తో మానవ విలువలు పెరుగుతాయని హిందీ అధ్యాపకురాలు జానకి తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో కళా శాల కరస్పాండెంట్ డాక్టర్ కె ఎస్ విష్ణు మోహన్ మాట్లాడుతూ హిందీ సాహిత్యం యొక్క గొప్పతనం హిందీ భాష తెలిసిన వారికే అర్థమౌతుందన్నారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్ భాషలతో బాటు హిందీ పై కూడా మక్కువ చూపాలన్నారు. ఈ సమా వేశానికి అధ్యక్షత వహించిన కళా శాల ప్రిన్సిపాల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఉపాదితో బాటు  ఇతర ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా,  ఇస్లామిక్ దేశాల కెళ్లినప్పుడు హిందీ భాష ఎంతగానో ఉపయోగ పడుతుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రాచ్య భాష అధ్యక్షులు కె వి ఎస్ పి బి ఆచార్య హిందీ అధ్యాపకురాలు సుమిత్ర అధ్యాపకులు బి వినాయకుడు, డాక్టర్ ఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముస్లింలకు ఎంపీ ఆదాల రంజాన్ కానుక

Bhavani

నూతన కలెక్టరేట్ త్వరగా పూర్తి కావాలి

Murali Krishna

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి

Bhavani

Leave a Comment