40.2 C
Hyderabad
April 29, 2024 16: 37 PM
Slider మెదక్

నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి

#kamareddy

కామారెడ్డి జిల్లాలో నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలకు జర్నలిస్టులు విజ్ఞప్తి చేసారు. మెదక్ జిల్లా నార్సింగిలో జిల్లాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో నకిలీ జర్నలిస్టుల అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో నకిలీ ఐడి కార్డులు సృష్టించుకుని పత్రికలు, యూట్యూబర్లు అంటూ కార్డులు తయారు చేసుకుని జిల్లాలోని రైస్ మిల్లర్లు, వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని జర్నలిస్టులు కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెల్లారు.

ఇప్పటికే కొందరు జర్నలిస్టులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇలాంటి జర్నలిస్టుల తీరుతో ఫీల్డ్ మీద నిజాయితీగా పని చేస్తున్న అసలైన జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అక్రమాలకు పాల్పడే జర్నలిస్టులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే పిడి యాక్టు నమోదు చేయుటకు పరిశీలించాలని కోరారు. స్పందించిన కలెక్టర్, ఎస్పీలు తక్షణమే చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వేణు, అంజి, నాగరాజు, కిషన్, రాము, ఇలియాజ్, సురేష్, ఆబిద్,  సాయిబాబా, ప్రభు, విజయానంద్, రంజిత్, బాలు, బాలాజీ, శివ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

సీతక్కను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాo

Bhavani

వైభవంగా రామసింగవరం కొండాలమ్మ దేవత ఉత్సవం

Satyam NEWS

Leave a Comment