26.7 C
Hyderabad
May 3, 2024 07: 32 AM
Slider ఖమ్మం

నూతన కలెక్టరేట్ త్వరగా పూర్తి కావాలి

#khammam

సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ నిర్మాణ పనులు త్వరగగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.  జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ తెలంగాణ కు హారితహరం ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు  సత్వరం అందేలా, ఒకే దగ్గర అన్ని జిల్లా అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యల దిశగా, భవనాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. కొనసాగుతున్న ఆయా పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాన్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రీనరిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణం, పరిస్థితులను తట్టుకొనే మొక్కలను ఎంచుకొని నాటాలన్నారు. భవనం మొత్తం తిరిగి ఏసీ, విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులలో వేగం పెంచాలని ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో  సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్,  విద్యుత్ ఎస్ఇ సురేందర్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, వాణిశ్రీ, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, అధికారులు, తదితరులు ఉన్నారు.

Related posts

ఏపి సిఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు

Satyam NEWS

ఎంపి ధర్మపురి అరవింద్ పై ఛీటింగ్ కేసు పెట్టాలి

Satyam NEWS

ప్రజా సంక్షేమానికి… ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment