37.2 C
Hyderabad
May 6, 2024 22: 10 PM
Slider నల్గొండ

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్న బిజెపి వాగ్ధానం ఏమైంది?

#citu

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా మార్చి 28,29వ, తేదీలలో జరగనున్న సమ్మెని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్మికులని బానిసత్వంలోకి నెట్టే విధంగా తెచ్చిన నాలుగు లేబర్ లేబర్ కోడులు రద్దు చేయాలని, సరళీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా సమ్మె జరగనున్నది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయం వద్ద రైస్ మిల్లు కార్మికుల గేట్ మీటింగ్ సమావేశంలో శీతల రోషపతి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు.

అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు,వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున 28,29వ,తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని మరో రైతు పోరాటంలా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సమాయత్తం కావాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో కార్మికులు, ఉద్యోగులు,రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో దొంగచాటుగా కార్మిక చట్టాలు, రైతు చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచంలో భారతదేశంలో బిజెపి ప్రభుత్వానికి ఉందని, మేధావులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు దినసరి కూలీల కార్మికులు,యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు సాముల కోటమ్మ,మోదల గోపమ్మ, బుజ్జి, వీరమ్మ, పద్మ,బేగం,వెంకటమ్మ,సునీత,భూలక్ష్మి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు

Bhavani

ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలతో జాదవ్‌కు స్వల్ప ఊరట

Sub Editor

Leave a Comment