31.7 C
Hyderabad
May 2, 2024 08: 00 AM
Slider వరంగల్

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

#anuraghealpingsociety

హన్మకొండలోని వికలాంగుల బాలికల ఆశ్రమం, ఆన౦ద నిలయం అనాథాశ్రమం లో హోళీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా. కె.అనితారెడ్డి పాల్గొన్నారు. పిల్లలతో ఆనందంగా రంగులతో, ఆట, పాటలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ జీవితం అంటే  మనం సంతోషంగా ఉండడం కాదని పది మందిని సంతోషపెట్టడం అని అన్నారు. 

దివ్యాంగులు, బధిరుల, అనాధ  పిల్లలతో గడపటం  సంతోషంగా ఉందని దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అఁదించాలని కోరారు. పిల్లలకు, అనాథలకు, వృద్ధులకు ఆమె హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఆనందంగా పండుగ జరుపుకోవాలని, వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకునే హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని  సూచించారు.

రసాయనాలు లేని రంగులు ఉపయోగించాలని, చెడుపై విజయమే హోలీ పండగ ఉద్దేశమని ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్టు  తెలిపారు. ఈ కార్యక్రమంలో సుష్మా, సుజాత, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

భత్యాల పోలీసులు,అధికారులను విమర్శిస్తే సహించేది లేదు

Satyam NEWS

(Free Trial) Side Effects After Taking Male Enhancement Pills What Is The Best Hgh Supplement Best Male Sex Pills

Bhavani

‘కోనాపురం లో జరిగిన కథ’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam NEWS

Leave a Comment