Slider సినిమా

‘కోనాపురం లో జరిగిన కథ’ సినిమా ట్రైలర్ లాంచ్

santosh 56

అనూష సినిమా బ్యానర్ లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి  సంయుక్తంగా నిర్మించిన సినిమా కోనాపురం లో జరిగిన కథ  థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం నాడు హైదరాబాద్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ టైలర్ ను ,పోస్టర్ ను లాంచ్  చేశారు. ఈ సినిమాకు   సంబంధించి నిర్మాతలు, హీరో  గజ్వేల్ నియోజకవర్గం కు చెందిన వారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి, తొలి హీరోగా, తొలి సినిమాగా వస్తున్న నేపథ్యంలో  తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సినిమాను ఆదరించాలని  ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. సినిమా మంచి సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో కూడి ఉందని ఆయన అన్నారు. ఈ సినిమా నవంబర్ ఫస్ట్ కు విడుదలవుతున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాని  వరంగల్ జిల్లా  నర్సంపేట కు చెందిన  కే బి కృష్ణ  దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  సునీత హీరోయిన్. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో అనిల్ మొగిలి,  చిత్ర నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి, దర్శకుడు కె బి కృష్ణ, చిత్ర సహాయకులు దుం బాల లింగారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

Related posts

కువైట్ లో చిక్కుకున్న ఆంధ్రా యువకుడి ఆర్తనాదం

Satyam NEWS

కోటప్పకొండ తిరుణాల కోసం ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

శ్రీ పోచమ్మ , శ్రీ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!