42.2 C
Hyderabad
May 3, 2024 17: 42 PM
Slider ప్రత్యేకం

హోమియో చికిత్స: కరోనా ‘ థర్డ్ వేవ్ ‘ థండర్

#durgaprasad

కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అంతం కాకముందే రాబోయే 2 – 3 నెలల్లో థర్డ్ వేవ్ రాబోతున్నదని సైంటిస్టులు సూచించడంతో పాటు ఇటీవల ఎయిమ్స్ ( ఢిల్లీ  ) డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా కూడా హెచ్చరించడం గమనార్హం !

మిగతా డాక్టర్లూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యటమే కాకుండా థర్డ్ వేవ్ ప్రభావం ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ వేరియంటున్ ను డెల్టా గా వ్యవహరిస్తున్నాము.

ఇక రాబోయేది డెల్టా ప్లస్ వేరియంట్. గత వారమే కోవిడ్ సోకిన కొంత మందిలో నిర్ధారించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ను కనుగొనడం జరిగింది. ఇది చాలా త్వరితంగా వ్యాపిస్తూ మరియు ప్రమాదంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వేరియంట్ మన శరీరంలో ఉన్న ఆంటీబాడీస్ ని తప్పించుకుని  ఇమ్యూన్ సిస్టమ్ ని బైపాస్ చేసే అవకాశం ఉన్నందున వాక్సిన్ రెసిస్టెంట్ గా మారే అవకాశం ఉంది. తద్వారా ఇదివరకు కరోనా వచ్చి తగ్గిన వారు మరియు వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలో కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావొచ్చనే సందేహాలు వస్తున్నాయి. కానీ థర్డ్ వేవ్ ప్రమాదం ఒక ఊహాగానమే. దీనికి సంభందించిన బలమైన ఆధారాలు ఏమీ లేవు.

ఇక వాక్సిన్ విషయానికి వస్తే 18 సం. వయస్సు పై వారికి అదీ ఇటీవలే ప్రారంభించారు. ఇంకా చాలా మంది మొడటి డోస్ కూడా తీసుకోని వారున్నారు. ఎంత త్వరగా వాక్సిన్ డ్రైవ్ కొనసాగిస్తే అంత త్వరగా  ‘ హెర్డ్ ఇమ్యూనిటీ ‘ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పటికి ఏ వేరియంట్ వచ్చినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు.

ఈ సం. జులై ఫస్ట్ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ‘ కోవిడ్ మరణాల నిర్మూలన సంవత్సరం ‘గా పాటించాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ చైతన్యం చేసి ప్రతి ఒక్కరూ వాక్సిన్ పొందే విధంగా అవకాశం కల్పించాలని , కోవిడ్ నిభందనలు విస్మరించకుండా కొంత కాలం పాటించాలని సీనియర్ హోమియోపతిక్ వైద్యులు డాక్టర్ జి. దుర్గాప్రసాద్ రావు కోరారు.

కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారాల నేపథ్యంలో , పైన సూచించిన నిబంధనలతో పాటు నివారణపై శ్రద్ధ వహిస్తే రాబోయే కాలంలో  కోవిడ్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడడమే  కాకుండా , కోవిడ్ మరణాలు పూర్తిగా తగ్గించవచ్చని చెప్పారు.

హోమియో చికిత్సతో మంచి ఫలితాలు

కరోనా ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ లల్లో హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ అద్భుతంగా ఫలితాల్నిచ్చాయి. ఇదిలా ఉండగా థర్డ్ వేవ్ లో ముఖ్యంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉండవచ్చన్న సందేహాల నేపథ్యంలో స్కూల్ గోయింగ్ ఏజ్ ( పద్దెనిమిది సం. లోపు వయస్సు ) పిల్లలకు హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చే అంశాన్ని  తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని డా.దుర్గాప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లల్లోనే కాకుండా అందరికీ అదే స్థాయిలో ఇన్ఫెక్షన్ సోకే  అవకాశం ఉండొచ్చని , వాక్సిన్ తరహాలోనే ప్రజలందరికీ హోమియో ప్రివెంటివ్ డోస్ లు పంపిణీ చేయాలని కోరారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా అన్ లాక్ చేసిన సందర్భంలో జులై ఫస్ట్ నుండి 50% ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ బోధన మాత్రమే అనుమతించి , విద్యార్థులు ఇంటి నుండే హాజర్ అవుతూ , సగం శాతం బోధనా సిబ్బందిని స్కూల్ విధులకు అనుమతించినా పెద్దలకు ,  స్కూల్ పిల్లలకు కరోనా హోమియో ప్రివేంటివ్ మెడిసిన్ పంపిణి చేసే విధంగా మన ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం , జూన్ 25 వ తేదీ నుండి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయుష్ విభాగం వారు కరోనా థర్డ్ వేవ్ హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ పంపిణీ ప్రారంభించారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో హోమియో చికిత్స కు అనుమతించారు.

గత మూడు దశాబ్దాలుగా  బ్రెయిన్ ఫీవర్ , ప్లేగ్ , డెంగీ , స్వైన్ ఫ్లూ , సార్స్  వంటి ఎన్నో ఎపిడెమిక్స్ కి రాష్ట్రమంతా ముఖ్యంగా స్కూళ్ళలో పిల్లలకి హోమియో ప్రివెంటీవ్ మెడిసిన్ ను మన రాష్ట్ర ఆయుష్ విభాగం వారే స్వయంగా  పంపిణీ చేసే వారని గుర్తుచేశారు.

ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా , నామ మాత్రపు ఖర్చుతో  సులభంగా  వాడుకునే హోమియో మందులు రోగనిరోధకశక్తిని పెంచుతూ ప్రజల స్వస్థతకు , శరీర రక్షణకు ఎంతగానో ఉపయోగ పడతాయని వివరించారు. * “పద్దెనిమిది సం.  లోపు పిల్లలకు ఇప్పట్లో వాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభించే అవకాశం లేనందున ఈలోపు ఎటువంటి ఆంక్షలు అవసరం లేని హోమియో ప్రివెంటివ్ డోస్ లు పంపిణీ చేస్తే  ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా చాలా మంది పిల్లల్ని కోవిడ్ బారిన పడకుండా ఆదుకున్నట్లు అవుతుంది “.

 ప్రభుత్వం అనుమతిస్తే ప్రభుత్వ హోమియో హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీలు , హోమియోపతి సంస్థలు & ప్రైవేట్ ప్రాక్టిషనర్స్ అందరి సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కరోనా హోమియో ప్రీవెంటివ్ మెడిసిన్ పంపిణీ చేయొచ్చని తెలియజేశారు.

డా . జి.  దుర్గాప్రసాద్ రావు.

సీనియర్  హోమియో ఫిజీషియన్

హైదరాబాద్. ఫోన్ : 9849182691

Related posts

ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ

Satyam NEWS

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం… వైసీపీకి షాక్

Satyam NEWS

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

Satyam NEWS

Leave a Comment