Slider ప్రత్యేకం

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

#lulu

యూ ఏ ఈ కి చెందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ మెగా మాల్ ను, మొట్టమొదటి లులు మాల్ ను హైదరాబాద్ నగరంలో 300 కోట్ల పెట్టుబడులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మొదటి లులు మాల్ ను ప్రారంభించనున్నారని లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ మెగా మాల్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లులు హైపర్ మార్కెట్, 75 కంటే ఎక్కువ స్థానిక అంతర్జాతీయ బ్రాండ్లు, 1400 మంది సెట్టింగ్ కెపాసిటీ కలిగిన 5 స్క్రీన్ సినిమా, మల్టీ క్యూసిన్ ఫుడ్ కోర్ట్, పిల్లల వినోద కేంద్రం మొదలైనవి ఉన్నాయని తెలిపారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూ సమీపంలో ఈ మాల్ ను ప్రారంభిస్తున్నట్లు, ఈ మాల్ ద్వారా  2000 మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నట్లు  తెలిపారు. ఈ మాల్ లో తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో  ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Related posts

గ్రీన్ లైట్: కీసర టోల్ ప్లాజా వద్ద పటిష్టమైన చర్యలు

Satyam NEWS

శ్రీ లలితా సోమేశ్వరుడి దర్శనం కోసం కాలినడకన జూపల్లి

Satyam NEWS

కొల్లాపూర్ లో 40 లక్షల రూపాయలతో లక్ష్మీదేవి అవతారం

Satyam NEWS

Leave a Comment