38.2 C
Hyderabad
April 29, 2024 21: 02 PM
Slider హైదరాబాద్

పేదల ఆరోగ్యానికి బస్తీ దవాఖానల అండ

#Minister KTR

బస్తి దావఖానల ద్వారా నాణ్యమైన  ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ రోజు మరో 45 బస్తి దావఖాన ప్రారంభించిన సందర్భంగా మంత్రి కే. తారకరామారావు మాట్లాడారు.

బస్తీదవాఖానాల ద్వారా ప్రజలకు మరిన్ని వైద్యసేవలు వారి పరిసరాల్లోనే అందుతాయన్నారు. స్థానికంగా పేద ప్రజలకు అవసరమైన రక్తపరీక్షల వంటి ఇతర వైద్య సదుపాయాలు సైతం వారికి ఉపయుక్తంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్ బస్తీలో వెంగల్ రావు నగర్ లోని యాదగిరి నగర్ లో బస్తి దావఖానలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య సౌకర్యాలను సదుపాయాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అక్కడి వైద్యసిబ్బంది మంత్రి బాడీ టెంపరేచర్ తోపాటు బిపి  చెక్ చేశారు. బస్తీ దవఖానా ప్రారంభించిన అనంతరం అక్కడ వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటిదాకా తాను  ప్రయివేట్ ఆసుపత్రుల్లో తనకున్న ఇబ్బందులకు వైద్యం చేయించుకుటున్నట్లు  ఆమె మంత్రి కేటీఆర్ కి తెలియజేసింది. ఇకపైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాకుండా స్థానికంగానే మీ బస్తీలోనే మంచి వైద్యం అందుబాటులోకి రావాడంతో పాటు, అవసరమైన చికిత్స, మందులు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆ వృద్దురాలికి మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న బస్తి దావఖానలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నేపథ్యంలో వీటిని మరింతగా విస్తరించే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మంత్రి కేటీఆర్ వెంబడి స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్ తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్,పురపాలక, వైద్యశాఖ ఉన్నతాధికారులున్నారు.

Related posts

వైసీపీ అరాచకాలను బయటపెడుతున్న సొంత పార్టీ నేత

Satyam NEWS

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

Homework may help learners keep rather more specifics than they’d inside classroom

Bhavani

Leave a Comment