40.2 C
Hyderabad
April 28, 2024 15: 33 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో అమెరికా క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు

america 20

ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్  ప్రతినిధుల బృందం బుధవారం హైదరాబాద్ లో పర్యటించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై చర్చించారు. ఆ తరువాత బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కే. జోషితో సమావేశమయ్యారు. అమెరికాకు చెందిన క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఢిల్లీ, అమృత్ సర్ లలో పర్యటించిన బృందం బుధవారం హైదరాబాద్ కు చేరుకుంది. అమెరికాలో ఈ నెట్ వర్క్ కు 140 సెంటర్స్, 265 డాక్టర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, అనుమతులు కూడా సత్వరమే కల్పిస్తామని ఈటల రాజేందర్, బోయినపల్లి వినోద్ కుమార్, సి.ఎస్, జోషి అమెరికా బృందానికి హామీ ఇచ్చారు. అనంతరం నిమ్స్ లోని ఆంకాలజీ విభాగాన్ని అమెరికా బృందం సందర్శించింది. క్యాన్సర్ రోగ నిర్ధారణ, నివారణకు అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో అమెరికా వైద్యులు ఔట్ పేషంట్స్ గా చికిత్స చేసే విధానం అందుబాటులో రానుందని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో తన ఆహ్వానం మేరకు వైద్యుల బృందం హైదరాబాద్ కు వచ్చిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ బృందంలో అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్ సి ఈ ఓ  బ్రాడ్ ప్రిన్క్ టిల్, సి ఓ ఓ టాడ్ స్కోన్ హార్జ్, ప్రముఖ ఆంకాలాజిస్ట్ లు రాకేష్ సెహగల్, ఉపేందర్ రావు లు ఉన్నారు.

Related posts

అధికారి చేసిన పనితో సమగ్ర శిక్ష బోధకులకు అన్యాయం

Satyam NEWS

రైతులతో బాటు వ్యాపారులకూ డిసిసిబి రుణాలు

Satyam NEWS

ఎదురు కాల్పుల్లో  మావోయిస్టు మృతి

Murali Krishna

Leave a Comment