31.2 C
Hyderabad
May 2, 2024 23: 55 PM
Slider ముఖ్యంశాలు

మూడు వేలకు పైగా బ్లాక్ మనీ…. ఎవరిది ఇది?

#blackmoney

హైదరాబాదు కేంద్రంగా నడుస్తున్న ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా బయటపడుతున్న బ్లాక్‌మనీ పలు ప్రశ్నలు లేవనెత్తున్నది. ఈ డబ్బు అంతా ఎవరిది? రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు బ్లాక్ మనీని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు.

ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్‌ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్‌మనీ గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు గుర్తించారు. తాజాగా రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో బ్లాక్‌మనీ లావాదేవీలు వెలుగుచూశాయి.

హైదరాబాద్‌కు చెందిన స్పెట్రా, సన్‌సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది. బ్లాక్‌మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు తయారుచేసుకున్నాయి.

యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Related posts

Hemp Cbd Oil Co2 Extract 3rd Party Tested

Bhavani

డ్రగ్స్ మాఫియా ను ప్రశ్నిస్తే తెలుగుదేశం పై దాడి చేస్తున్నారు

Satyam NEWS

వందేళ్ల చరిత్ర కలిగిన సంగీత కళాశాలలో కళానిధి మంగళం పల్లి జయంతోత్సవం

Satyam NEWS

Leave a Comment