31.2 C
Hyderabad
May 3, 2024 02: 59 AM
Slider ప్రత్యేకం

ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరిన జనం

#krishnapatnam

కరోనాపై తీవ్ర ప్రభావం చూపుతూ వేలాది మందిని వ్యాధి నుంచి బయటపడేస్తున్న ఆనందయ్య ఆయుర్వేదం మందు కోసం జనం బారులు తీరారు.

ఆనందయ్య మందు పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అక్కడ పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు  నిలిచి పోతున్నాయి.

చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి. నెల్లూరు జిల్లా మీడియా మొత్తం కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.

కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.

పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు.

మరోవైపు ఇప్పటికే కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉండిపోయారు.

మార్గ మధ్యంలో ఒక కరోనా రోగికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడటంతో అంబులెన్సులోనే ఆనందయ్య మందును ఆమె కంట్లో వేశారు. (వీడియోలో చూడవచ్చు)

Related posts

ప్రధానిపై అసభ్య పోస్టులు పెట్టిన అటవీశాఖ అధికారి

Satyam NEWS

ఉపాధ్యాయులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

Satyam NEWS

ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల్నిమట్టుపెట్టిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment