25.2 C
Hyderabad
May 13, 2024 10: 29 AM
Slider ఆధ్యాత్మికం

అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల

#sabarimala

కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా ఆంక్షలు లేకుండా తొలి సారి నిర్వహిస్తున్న ఈ శబరిమల యాత్రకు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజూ లక్ష మంది వరకు అయ్యప్ప సన్నిధికి వస్తున్నారు.

దర్శనం, పార్కింగ్‌ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో నిమిషానికి 80 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పార్కింగ్‌ ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. సన్నిధానం, నందపంథల్‌  ప్రాంతాలైతే భక్తులతో కిటికటలాడుతున్నాయి. భక్తులు రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం బోర్డు 19 గంటల వరకు పొడిగించింది.

Related posts

రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రం ప్రత్యేక పూజలు

Satyam NEWS

‘సమ్’ క్రాంతే…

Satyam NEWS

వ్యాయామం చేయడం వల్ల ప్రతి ఒక్కరు దృఢంగా ఉంటారు

Satyam NEWS

Leave a Comment