37.2 C
Hyderabad
April 26, 2024 21: 51 PM
Slider కవి ప్రపంచం

‘సమ్’ క్రాంతే…

#Devalapally Sunanda

ఎగిరే గాలిపటాలు లేక ఆకాశం చిన్నబోయింది

భోగిపళ్ళు పోసిన ఆనవాలు లేక ఇంటి గడపలన్నీ బోసిపోయినాయి

డూడు బసవన్నలు సన్నాయి మేళాలు లేక వీధులన్నీ వెలవెలపోతున్నాయి

పల్లెటూళ్లలో సైతం రంగునీళ్ల కళ్ళాపి ఫ్యాషన్ అయ్యింది

పిండివంటల ఘుమ ఘుమలన్నీ స్వగృహ ఫుడ్ సెంటర్లకి పరిమితమయ్యాయి

వంటింట్లో మూకుళ్ళు మూలన పడ్డాయి

పల్లెలన్నీ కూడా పట్నం బాట పట్టాయి

పండగలన్నీ ఈవెంట్లుగా మారిపోతున్నాయి

ఎవరో వచ్చి సరదాగా సంబరాలు చేయించి పోతున్నారు

ఇంట్లో బంధువుల రాకపోకలు లేవు

సరదాగా చెప్పుకునే ముచ్చట్లు లేవు

ఇంట్లో చేసే రకరకాల వంటల రుచులు లేవు

స్విగ్గీ లో కొత్త రుచులను ఆర్డర్ చేసుకు తింటున్నారు

మామిడాకుల బంతి పూల తోరణాలు మాయమయ్యి

ప్లాస్టిక్  తోరణాలతో గుమ్మాలు  వెలవెలపోతున్నాయి

పండగల సంబరాలన్నీ బుల్లితెరపై అంబరాన్నంటుతుంటే

మనమేమో మరమనుషుల్లా టీవీల ముందు కూర్చుని

పండుగలను ఆస్వాదిస్తూ

వాట్సాపుల్లో ఫేస్బుక్కుల్లో బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ

మన సంప్రదాయాలకు దూరం అవుతున్నాము

విదేశాల్లో ఉన్న మన తెలుగోళ్ళు మాత్రం

మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ

తెలుగుదనాన్ని బతికిస్తున్నారు

సంప్రదాయ దుస్తుల్లో మన తెలుగు వంటకాల రుచులను విదేశీ మిత్రులకు చూపిస్తూ

పండుగలను సంబరంగా చేసుకుంటున్నారు

ఇక్కడేమో ‘సమ్’ క్రాంతే…

సంపూర్ణ సంక్రాంతి ఎప్పుడో…

దేవలపల్లి సునంద, 8297744716

Related posts

టియుడబ్లుజె జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

పశువుల తరలింపులో నిబంధనలు పాటించకుంటే చర్యలు

Satyam NEWS

నిరాడంబరంగా ఒంటిమిట్ట కోదండ‌రాముని క‌ల్యాణం

Satyam NEWS

Leave a Comment