26.7 C
Hyderabad
May 3, 2024 10: 14 AM
Slider ముఖ్యంశాలు

ఓవైపు సిరిమాను సంబరం..మరోవైపు కంట్రోల్ రూంలో వర్షపు నీరు

#rainwater

ప్రతిష్టాత్మకంగా విజయనగరం సిరిమాను సంబరం జరుగుతోన్న వేళ…నిఘానేత్రాలతో పహరా కాస్తున్న పోలీసు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో… కంట్రోల్ రూంలో వర్షపు నీరు చేరి నిల్వ అయింది. ముందు రోజు తొలేళ్ల ఉత్సవం రోజు నే మధ్యాహ్నం వరకు భారీ వర్షం పడి..రాత్రి అయ్యేసరికి నిండు పున్నమి కనిపించడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అర్థరాత్రి ఘటాలు వచ్చే సమయంలో మటుకు భారీ వర్షం కురవడంతో అంతా చిత్తడిగా మారింది. సిరిమానోత్సవ ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఎమ్మెల్యే లు అప్పరనరసయ్య…మంత్రి బొత్స సత్యనారాయణ లు అమ్మవారి ని దర్శనం చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో సిరిమాను పై అమ్మ వారి రూపంలో ఉన్న పూజారి బంటుపల్లి వెంకటరావు… ఆసీనులు కావడంతో సిరిమానోత్సవం ప్రారంభమై…చదురగుడి నుంచీ కోట వరకు మూడు సార్లు తిరగడతో ఉత్సవం పూర్తవుతుంది.

Related posts

పాక్ లో ఆర్ధిక సంక్షోభం: ప్రత్యర్థుల అరెస్టుల్లో పాలకులు బిజీ

Satyam NEWS

డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్

Sub Editor 2

సిపిఐ నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

Bhavani

Leave a Comment