36.2 C
Hyderabad
May 15, 2024 17: 03 PM
Slider జాతీయం

హైదరాబాద్ హునర్ హాట్ లో ఆవిష్కృతమైన తెలంగాణ

#hunarhaat

హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హునార్ హాట్ లోని ఫుడ్ కోర్టులో మినీ ఇండియా రుచులు దొరుకుతున్నాయి. హునార్ హాట్ ఫుడ్ కోర్ట్‌లోని స్టాల్ నంబర్ 6 హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ జోహెబ్‌ ఫ్రైడ్ చికెన్ ప్రత్యేకంగా ఎంతో మందిని ఆకర్షిస్తున్నది.

అదే విధంగా డెహ్రాడూన్, లక్నో, సూరత్, పుదుచ్చేరి కి చెందిన ఫుడ్ స్టాల్స్ మరింత మందిని ఆకర్షిస్తున్నాయి. హునార్ హాట్ లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నిఖ్వీకి మహ్మద్ జోహెబ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

జోహెబ్ లాగా, మహ్మద్ ఆరిఫ్ కూడా నాల్గవసారి హునార్ హాట్లో స్టాల్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పొందారు. సూరత్, ఢిల్లీ మరియు పుదుచ్చేరిలో హైద్రాబాదీ బిర్యానీ అమ్మడం ద్వారా  ఆరిఫ్ కు మంచి ఆదాయాం వచ్చింది. స్టాల్ నంబర్ 39 కరీంనగర్‌కు చెందిన సరస్వతికి చెందినది. లెదర్ పర్సులు, బ్యాగులు విక్రయిస్తున్నారు.

సరస్వతికి రెండవసారి హునార్ హాట్‌లో స్టాల్ ఇవ్వబడింది. సూరత్‌లో జరిగిన అమ్మకాలతో చాలా ఉత్సాహంగా పాల్గొని  ఆనందంగా ఉన్నానని చెప్పింది సరస్వతి, హైదరాబాద్‌లోని హునార్ హాట్లో వచ్చిన ప్రతిస్పందనతో ఉత్సాహంగా కనబడుతుంది.

హునార్ హాత్‌లో తొలిసారిగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన వారు కూడా ఉన్నారు. “మేరా గావ్ మేరా దేశ్” ఫుడ్ కోర్ట్‌లో రంగారెడ్డికి చెందిన ఆర్.పద్మ స్టాల్ నంబర్ 33 ఏర్పాటు చేశారు. 39 ఏళ్ల పద్మ ఓ మహిళా గ్రూపుతో అనుబంధంగా ఉంటూ పాపడాల తయారీలో పనిచేస్తోంది.

వీరి బృందంలో 10 మంది మహిళలు ఉన్నారు. పద్మ మొదటిసారిగా హునార్ హాట్‌లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఆమె వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయి. తన గ్రూప్‌లోని మహిళలందరినీ ప్రోత్సహించేలా హునార్ హాట్‌లో స్టాల్స్‌ను ఇతర నగరాల్లో నిర్వహించినప్పుడు వారికి కూడా స్టాల్స్ పెట్టుటకు అవకాశం ఇవ్వాలని పద్మ కోరుతోంది.

హైద్రాబాద్‌లోని హునార్ హాట్‌తో తెలంగాణ కథ ఇక్కడితో ముగియలేదు. పద్మలాగే రంగారెడ్డికి చెందిన స్వాతి, హైదరాబాద్‌కు చెందిన బాలాజీ జాదవ్‌లు కూడా తొలిసారిగా హునార్‌హాట్లో భాగమయ్యారు. స్టాల్ నంబర్ 126 స్వాతిది అలాగే బాలాజీ స్టాల్ నంబర్ 246. ఇద్దరూ హైద్రాబాదీ ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలను విక్రయిస్తారు.

హునార్ హాట్లో స్టాల్స్ ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, మంత్రి నిఖ్వీకి కృతజ్ఞతలు తెలుపుతూ, తమకు హునార్ హాట్‌లోపెట్టె స్టాల్స్ లో మరింత అవకాశం ఇవ్వాలని  కోరుకుంటున్నారు. తనకు ఉమ్మడి కుటుంబం ఉందని, 17 మందితో కూడిన తన కుటుంబానికి హునార్ హాట్ నుంచి చాలా సహాయం లభిస్తుందని స్వాతి చెప్పింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నిఖ్వీ నేతృత్వంలో, దేశవ్యాప్తంగా హునార్ హాట్ నిర్వహించబడుతుంది. కాలానుగుణంగా, కళాకారులు, హస్తకళాకారులు మరియు కళాకారులందరూ వివిధ నగరాల్లోని హునార్ హాట్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. వారి సహాయకులలో ఒకరికి ప్రభుత్వం ఛార్జీలను భరిస్తుంది.

స్టాల్ పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. అంతే కాకుండా, హునార్ హాట్ నిర్వహించినన్ని రోజులకు ప్రభుత్వం వారికి రోజుకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రాఫ్ట్, వంటకాలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి “వోకల్ ఫర్ లోకల్”, “ఆత్మనిర్భర్ భారత్” ప్రచారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. హైద్రాబాద్‌లోని హునార్ హాట్కు తెలంగాణ ప్రజల నుండి భారీ మద్దతు, సహకారం లభిస్తోంది, ఇది దుకాణదారులందరినీ సంతోషం, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

Related posts

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్

Murali Krishna

సొంత ఖర్చుతో యాగం చేసుకోండి

Satyam NEWS

క్యాబినెట్ డెసిషన్: ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి

Satyam NEWS

Leave a Comment