23.2 C
Hyderabad
May 8, 2024 01: 57 AM
Slider నల్గొండ

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సి.ఈ.ఓ.కి ముస్లిం సోదరుల ఫిర్యాదు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీద్ పాత కాంప్లెక్స్ 9వ,నెంబర్ షాపు ఎలాట్మెంట్ విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని నోటిఫికేషన్ లేకుండా షాపును ఇతరులకు ఎలా కేటాయిస్తారని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ను మైనార్టీల సోదరులు ప్రశ్నించారు.

గురువారం ఉస్మానియా మసీద్ ఆవరణలో జరిగిన సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ. అజీజ్ పాషా,షేక్ నవాబ్ జాని,షేక్ సైదా మాట్లాడుతూ హుజూర్ నగర్ కేంద్రం లోని ఉస్మానియా మసీదు వక్ఫ్ పాత షాపింగ్ కాంప్లెక్స్ లోని 9వ,నెంబర్ షాపుకు నోటిఫికేషన్ లేకుండా ఎలాట్మెంట్ జారీ చేయటంలో లక్షల రూపాయలు చేతులు మారాయని, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులకు తప్పుడు నివేదికలను సమర్పించి తప్పుదోవ పట్టించి వక్ఫ్ బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయించారని అన్నారు.

మసీద్ మేనేజ్మెంట్ కమిటీకి గాని, స్థానిక ముస్లింలకు గాని తెలియ పర్చకుండా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఎలాట్మెంట్ ఎలా జారీ చేస్తారని వక్ఫ్ బోర్డు అధికారులను  ప్రశ్నించారు.

28 సంవత్సరాలుగా కాంప్లెక్స్ నందు అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని,ఐక్య కార్యాచరణ పోరాటాలు చేస్తుంటే మరలా కొంత మంది క్షేత్ర స్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు వక్ఫ్ బోర్డ్ నియమాలకు విరుద్ధంగా ఎలాట్మెంట్ లకు కారణమై కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని,ఇలాంటి  వక్ఫ్ బోర్డు అధికారులను సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. అవకతవకలకు పాల్పడితే హుజూర్ నగర్ పట్టణ ముస్లిం సోదరులు చూస్తూ ఊరుకోరని,ఎలాంటి పోరాటానికైనా సిద్దమవుతామని అన్నారు.షాపు కేటాయింపుల్లో జరిగిన కుంభకోణంపై రాష్ట్రస్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి అవకతవకలకు పాల్పడ్డ వక్ఫ్  బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

షాపు నెంబర్ 9 పై జారీచేసిన ఎలాట్మెంట్ తక్షణమే రద్దు చేయాలని, వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ జరిపి అర్హులైన ముస్లిం సోదరులకు షాపు కేటాయింపు జరపాలని అజీజ్ పాషా,నవాబ్ జానీ,సైదా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు బిక్కన్ సాహెబ్,మిల్లు రహీమ్,మున్నా,డ్రైవర్ ముస్తఫా,రిపోర్టర్ సైదా,ఇబ్రహీం,భాషా,రషీద్,నయీమ్, రసూల్,నాగులు,మజీద్,మొయిన్, సలీం,గౌస్,మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి

Satyam NEWS

హైద‌రాబాద్ లో బీజేవైఎం అర్ధనగ్న ప్రదర్శన…

Satyam NEWS

అందంగా ప్రకృతి వనం

Sub Editor 2

Leave a Comment