27.2 C
Hyderabad
December 8, 2023 17: 59 PM
Slider తెలంగాణ

సొంత ఖర్చుతో యాగం చేసుకోండి

Krishnasagara rao

జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ​యాగాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు విమర్శించారు. యాగాలు, పూజలకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే కేసీఆర్ సొంత ఖర్చులతో యాగాలు చేస్తే తమకు అభ్యంతరంలేదని ఆయన అన్నారు. యాగాలకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించ వద్దని ఆయన హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీని కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందువుల మనోభావాలను కేసీఆర్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ ఆవేశంతో బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు. కరీంనగర్‌లో అక్బరుద్దీన్ ప్రసంగాన్ని ఖండించే ధైర్యం‌ కూడా పొన్నం ప్రభాకర్‌కు లేదని దుయ్యబట్టారు. బీజేపీ బలం ఏంటో కరీంనగర్ ప్రజలు పొన్నంకు చూపించారని చురకలంటించారు. ‘గాంధీ భవన్ ఫర్ సేల్’ అని కాంగ్రెస్‌ నేతలు బోర్డు పెట్టుకోవాలని కృష్ణసాగర్​రావు ఎద్దేవా చేశారు.

Related posts

చైనాలో సేల్స్ మేనేజర్ల సర్వేలో ప్రతికూల ఫలితాలు

Bhavani

తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శికి విశేషంగా ఏర్పాట్లు

Satyam NEWS

కులాల పేరుతో కుట్ర: బాలయ్య, చిరంజీవి అభిమానులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!