28.2 C
Hyderabad
June 14, 2025 11: 10 AM
Slider జాతీయం

రెవెర్స్:వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భార్యహత్య

తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డొస్తోందని ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసి ఆమెతో భర్త సైనైడ్ మింగించి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటు చేసుకుంది. బరోడా బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న రవికిరణ్ అనే వ్యక్తి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని భార్య ఆమని(24)ని సైనైడ్ మాత్రలు మింగించి హత్య చేశాడు.

సహజమరణం గా చిత్రీకరించాలనుకున్న భర్త చేష్టలను అనుమానించి రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి తోశారు.సినీ ఫక్కీలో పక్కా పథకం ప్రకారం చేసిన ఈ హత్య పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత నిజాలు వెలుగు చూశాయి.భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు.

Related posts

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కోర్టు సమన్లు

Satyam NEWS

జగన్ లేఖపై సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఖండన

Satyam NEWS

టిడ్కో గృహాలు కేటాయించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌

Sub Editor

Leave a Comment

error: Content is protected !!