27.7 C
Hyderabad
April 30, 2024 10: 29 AM
Slider కర్నూలు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంపై విచారణ షురూ

#SrisailamDam

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతున్నది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ ప్రారంభం అయింది.

ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్‌ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్‌ బృందాలు వీడియో తీశారు.

పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్‌ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా?

అన్న దానిపై సీఐడీ టెక్నికల్‌ బృందం విశ్లేషించనుంది. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు.

Related posts

గ్రీన్ ఎనర్జీ కారిడార్‌పై కేంద్ర కీలక నిర్ణయం

Sub Editor

రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చిన కవిత

Satyam NEWS

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సత్యాగ్రహం

Satyam NEWS

Leave a Comment