39.2 C
Hyderabad
May 3, 2024 13: 26 PM
Slider ప్రపంచం

ప్రేమ కోసం : పాకిస్తాన్ వెళ్లి జైల్లో మగ్గి చివరికి హైదరాబాద్ చేరిన యువకుడు

hyderabad sofrware employ went to pakistan to love a girl returned from jail


ప్రేమ కోసమే వలలో పడనే పాపం పసివాడు అనే పాట గుర్తుందా మీకు అలాగే ప్రేమ కోసమే పాకిస్తాన్ వెళ్లనే ఈ విశాఖ కుర్రాడు వెళ్లి జైల్లో మగ్గనే పాపం పసివాడు అన్నట్లు గా ఒక యువతీ ప్రేమ కోసం బారి సాహసమే చేసి చివరికి ప్రాణాలతో బయట పడ్డ హైదరాబాదుకు చెందిన టెక్కీ ప్రశాంత్ కథ ఇది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ప్రవేశించి, అక్కడి భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అయితే, భారత అధికారుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ప్రశాంత్ విడుదలయ్యాడు.

2017లో పాకిస్థానీ తనకు పరిచయమున్న అమ్మాయిని కలిసేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా ప్రశాంత్ సాహసం చేశాడు. పాస్ పోర్ట్ సహా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా పాక్ భూభాగంపై కాలుమోపాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితుడిని కలవడానికి స్విట్జర్లాండ్ వెళ్లాలని బయలు దేరానని తానూ పాకిస్తాన్, ఇరాన్, టర్కీ మీదుగా యూరప్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నానని అయితే తన పథకం విఫలమై గూగుల్ మ్యాప్స్‌లో చూపిన మార్గాన్ని అనుసరిస్తు ఇక్కడికి వచ్చానని బహవల్‌పూర్‌లో పాకిస్తాన్ అధికారులు అతన్ని పట్టుకున్నప్పుడు ప్రశాంత్ మీడియాతో అన్నారు.

అరెస్ట్ చేసి నన్ను లాహోర్ జైలులో బాగా ఉంచారు అంతకు ముందు నేను పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉన్నాను. త్వరలోనే విడుదల చేస్తానని మొదట చెప్పాఋ కానీ అది చాలా కాలం పాటు లాగబడి చివరికి ఇలా ఇక్కడికి చేరుకున్నానని ”అని ప్రశాంత్ చెప్పాడు, ఆ మధ్య అతను సురక్షితంగా ఉన్నానని తన కుటుంబానికి వీడియో సందేశం పంపగలిగాడు.

ఫేస్బుక్లో పరిచయమైనా అమ్మాయి ని ప్రేమించి స్విట్జర్లాండ్‌కు వెళ్లినప్పుడు అతను నిరాశకు గురయ్యాడు. “స్విట్జర్లాండ్‌కు వెళ్లవద్దని నా తల్లి నాకు చెప్పింది. నేను అమ్మ మాట విన లేదు ఇబ్బందుల్లో పడ్డాను, ”అని అతను అన్నారు.

విశాఖపట్నం లు చెందిన ప్రశాంత్ 2017 ఏప్రిల్‌లో కనబడపోయేనాటికి హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. మాధపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. 2019 నవంబర్‌లో అతను పాకిస్తాన్ జైలులో ఉన్నాడని అతని కుటుంబ సభ్యులకు తెలియగానే ఈ కథ ఒక మలుపు తిరిగింది.

విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, భారత విదేశాంగ శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశారు.

అనేక ప్రయత్నాల అనంతరం ప్రశాంత్ ను విడుదల చేసిన పాక్ అధికారులు… వాఘా బోర్డర్ వద్ద అతడిని భారత అధికారులకు అప్పగించారు. ప్రశాంత్ విడుదల నేపథ్యంలో అతడి కుటుంబంలో సంతోషం పెల్లుబుకుతోంది.ఎట్లు కేలకు మంగళవారం ప్రశాంత్ ను అతని సోదరుడికి పోలీసులు అప్పగించగా వారిద్దరూ కలవడం ఆలింగనం చేసుకోవడం తో ఇది ఒక ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది. సైబరాబాద్ పోలీసులు సజ్జనార్ సమక్షం లో అతన్ని అప్పగించారు. వారు త్వరలో విశాఖపట్నం బయలుదేరనున్నారు.

“నేను జైలు నుండి ఎప్పటికీ విడుదల చేయబడనని అనుకున్నాను. సమయం గడిచేకొద్దీ నేను ఆశను కోల్పోయాను, ”అని హైదరాబాద్ చేరుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ తిరిగి రావడం సంతోషంగా ఉందని ప్రశాంత్ రోదిస్తూ అన్నారు.మొత్తనికి నాలుగేళ్ల మిస్సింగ్ కాసే సాల్వ్ కావడం తో పోలీసులు ,తిరిగి బ్రతికి హైద్రాబాద్కు ప్రశాంత్ చేరు కోవడం తో కథ సుకాంతమయింది.సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చొరవతో ప్రశాంత్ బతికి బయట పడటం తో అతనికి ఆ కుటుంబంకృతజ్ఞతలు తెలియ జేసింది.

Related posts

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మళ్లీ రాహుల్ గాంధీ

Satyam NEWS

ములుగులో మడుగూరి నాగేశ్వర్ రావుకు సన్మానం

Satyam NEWS

అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి

Satyam NEWS

Leave a Comment