39.2 C
Hyderabad
May 3, 2024 11: 53 AM
Slider మహబూబ్ నగర్

వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది

#Valmik

బోయ వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నాది.. వాల్మీకి సోదరులందరూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే ఆ బహిరంగ సభలోనే సంబంధిత కేంద్ర మంత్రిచే హామీ ఇప్పించి ఎస్టీ జాబితాలో చేర్పిస్తానని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ వాల్మీకి సోదరులకు హామీ ఇచ్చారు.

శనివారం డికె.బంగ్లాలో వాల్మీకి సోదరులు డికె. అరుణమ్మ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి వాల్మీకుల బిల్లులోనే మరొక రిజర్వేషన్లు కూడా కలిపి మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది కూడా వాల్మీకి సోదరులతో పాటు ఖైతి లంబాడి, వాలి కులాలను కూడా కలిపి బిల్లును కేంద్రానికి పంపారని అన్నారు.

వాల్మీకుల ఓట్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మీతో నాటకలాడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని అన్నారు. గద్వాల అభివృద్ధి డికె. అరుణమ్మ తోనే సాధ్యమైందని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కూడా తానే చేయిస్తానని ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి హామీ అని ఆమె భరోసా కల్పించారు.

గద్వాల నియోజకవర్గంలో పాటు జిల్లాలోని అన్ని మండల లలో ఉన్న వాల్మీకులతో చర్చించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని మీ డిమాండ్ ను పెట్టాలని సూచించారు. ఈ సభకు సంబంధిత కేంద్ర మంత్రిని తీసుకువచ్చి పూర్తి హామీ ఇప్పిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, కౌన్సిలర్లు గుర్రం నరసింహులు ,సర్పంచ్ హన్మంత్ ,వాల్మీకి సోదరులు వైండింగ్ రాములు,దాసు, రామచంద్రుడు ,నెమలి కంటి రామంజి ,సంఘాల నర్సింలు, ఉలిగేపల్లి సవరన్న, బాలు,తోట రాములు,మహేష్ నాయుడు, సద్దల్ రాములు, సురేష్ ,సుధాకర్ నాయుడు,జమ్మన్న, రఘు తదితరులు ఉన్నారు.

Related posts

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్యే మేడా ఫ్యామిలీ జనతా క్లాప్స్

Satyam NEWS

దేశవ్యాప్త హర్తాళ్ ను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment