జనతా కర్ఫ్యూ లో భాగంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వేంకట మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ జనతా క్లాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చేపట్టిన జనతా కర్ఫ్యూ లో జనతా క్లాప్స్ లో భాగంగా సాయంత్రం 5గంటలకు రాజంపేట వ్యాప్తంగా ప్రజలు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం ప్రకటించారు.
అదే విధంగా కరోన వైరస్ రాష్ట్ర వ్యాప్తింగా వ్యాపించ కుండా పోరాడిన రియల్ హీరోస్ వాళ్ల త్యాగానికి సలాం చేదాం అంటూ రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి ఆయన సతీమణి మేడా సుచరిత తమ నివాసం లో కుటుంబ సభ్యులు లతో చప్పట్లు తో అభినందనలు తెలిపారు.