ములుగు నియోజకవర్గంలో దళితులకు పార్టీ మండల, జిల్లా అధ్యక్షుల పదవులలో సముచితమైన స్థానం కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ లోని దళిత నేతలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన నేడు ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నియోజకవర్గ కమిటీ ఇంచార్జి లు గుడిమల్ల రవి కుమార్, నిల శ్రీధర్ రావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో దళిత సామాజిక వర్గనికి చెందిన వారు ఉన్నప్పటికీ సమాన అవకాశాలు దక్కడం లేదని వారన్నారు.
తమకు భూములు లేవు, పట్టాలు లేవు, ఏజెన్సీలో పైసా చట్టం వల్ల ప్రజాప్రతినిధులం కూడా కాలేక పోతున్నామని వారన్నారు. ఓట్లు వేయడానికి తప్ప పదవులకు తమను దూరం పెడుతున్నారని వారన్నారు. తప్పకుండా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత జన సేవ సమితి జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య, దూడపక రాజేందర్, నెమలి బాలకృష్ణ, డొంక వెంకన్న, మునగాల వెంకన్న, జన్ను సుధాకర్, జన్ను కరుణాకర్, చేనామల్ల ఐలయ్య తదితరులు ఉన్నారు.