Slider మహబూబ్ నగర్

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా?

#IJU Journalists

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవి శాఖ అతిథి గృహంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలం నల్లమల జర్నలిస్ట్ లకు సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హాజరైన పేపర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. పూట గడువని జర్నలిస్ట్ ల పరిస్థితిని చూసి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో అవమానాలకు గురి చేస్తూ సిఎం కేసిఆర్ ప్రభుత్వం దోషులుగా చూస్తుందని ఆయన ఆరోపించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్ణయ్య, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు, సినియర్ జర్నలిస్ట్ లు రవింధర్ రెడ్డి, సురేష్, ప్రకాష్,అంజయ్య, రామకృష్ణ, శ్యాం, స్థానిక‌ జర్నలిస్ట్ లు కొండయ్య, బాలస్వామి, బాలకృష్ణ, సైదులు, శ్రీనివాస్, పవన్, వెంకటయ్య, శేఖర్, అంజి, వెంకటేష్, ప్రశాంత్, వేదాంతం, బుచ్చన్న తదితరులున్నారు.

Related posts

బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

mamatha

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

Satyam NEWS

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS

Leave a Comment