38.2 C
Hyderabad
May 2, 2024 20: 20 PM
Slider రంగారెడ్డి

అక్రమ భారీ షెడ్డు నిర్మాణం: పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఎ సి పి

#kapra

కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్ ఎల్లారెడ్డి గూడ సమీపంలో భారీ షెడ్డు అక్రమ నిర్మాణం చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలని వాసులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా భారీ అక్రమ నిర్మాణం చేపడుతున్న కాప్రా సర్కిల్ ఉన్నత సంబంధిత అధికారులకు కనపడడం లేదా అని సర్కిల్ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతి లేకుండా చిన్న గృహ నిర్మాణం చేపట్టిన వాలిపోయే టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ అక్రమ నిర్మాణాలు కనిపించవా అని అధికారుల తీరుపై మండి పడుతున్నారు. అలాంటి అనుమతి లేదంటూ కుషాయి గూడ కట్టెల గుడిసెను కూల్చి వేసిన, న్యాక్ ఇంజనీర్ లకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ భారీ షెడ్డు నిర్మాణం కనపడడం లేదా ఆని నిలదీస్తున్నారు. ఇట్టి పిర్యాదు మాధ్యమాల్లో కే టి ఆర్ కు సైతం , ఎ సిపి తీరుపై పిర్యాదు చేసినట్లు సర్కిల్ కాలని సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు తెలిపారు. బడా బాబులు కు ఒక న్యాయం, పేద ప్రజలకు మరోక న్యాయమా అని నిలదీస్తున్నారు.ఇప్పటికైన సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పందించి సర్కిల్ పరిధిలోని కొనసాగుతున్న అక్రమ షెడ్ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సత్యంన్యూస్ మేడ్చల్ జిల్లా

Related posts

రోగ నిర్ధారణకు స్కానింగ్ అవసరం

Bhavani

మెగాస్టార్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Sub Editor

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment