42.2 C
Hyderabad
April 26, 2024 17: 53 PM
Slider గుంటూరు

రోగ నిర్ధారణకు స్కానింగ్ అవసరం

రోగికి వ్యాథి నిర్థారణకు స్కానింగ్ అవసరమని Dr.రియాజ్ ఖాన్ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు దిలిప్ రాజా చే ప్రతివారం నిర్వహిస్తన్న”అడగండి చెబుతా”లో వ్యాధి నిర్ధారణలో రక్త పరీక్షలు,ఎక్స్ రే,స్కానింగ్ పరీక్షలు ఆధునిక వైద్య విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్కానింగ్ ప్లానింగ్ అంశంపై చర్చా వేదిక అవగాహన కార్యక్రమం జరిగింది.

ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ రియాజ్ ఖాన్ చర్చ లో పాల్గొంటూ అల్ట్రా సౌండ్,ఏమ్మారై స్కానింగ్ లో రేడియేషన్ వుండదని తెలిపారు. కొన్ని పరీక్షల్లో రేడియేషన్ వుంటుందని మరికొన్ని పరీక్షల్లో రేడియేషన్ వుండదని అయన స్పష్టం చేశారు. గర్భంలో ఎదుగుదల సక్రమంగా లేకపోతే నీటి తొట్టెలో వుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తే బిడ్డ ఎదుగుదల వుంటుందని అంతర్జాతీయ జర్నల్స్ నివేదిక ఇచ్చాయని అయన పేర్కొన్నారు. దీనివలన పిండానికి ఎలాంటి కీడు జరగదని రియాజ్ ఖాన్ చెప్పారు. గర్భిణీ స్త్రీలకు ఎక్స్ రే, ఏమ్మారై పరీక్షలు చేయరాదని తెలిపారు.

డాక్టర్లకు రోగి ప్రాణం కాపాడటమే మఖ్యమని కొందరు అనవసరంగా స్కానింగ్ లు రాస్తున్నారన్న దానికి సమాధానమిచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పేథాలజిస్ట్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ మహిళల్లో వస్తున్న గర్భసంచి ముఖ ద్వార కేన్సర్,వృక్షోజాల కేన్సర్ లకు ఇస్తున్న కీమోథెరపీ వలన కొంత ఇబ్బంది వున్నప్పటికీ దానికన్నా మెలే అధికం అన్నారు. కేన్సర్ ను ముందుగా గుర్తించే పరీక్షలు ఇప్పుడు వచ్చాయని, దానిద్వారా వ్యాధి నివారణ జరుగుతుందని ఆయన అన్నారు. రక్తపరీక్షలు చేపించుకుంటేనే ఎలాంటి వ్యాధి లోపల వుందో తెలుస్తుందని ఏమ్మారై స్కానింగ్ నిపుణులు షేక్ ఖాదర్ భాషా అన్నారు. కోవిడ్ తో మరణించిన Dr.లవకుశులు Dr.ప్రవీణ్ లకు నివాళ్ళు చర్చావేదికలో నివాళ్ళు అర్పించింది.

Related posts

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

వరిపంట చేతికి వచ్చే దశలో రైతాంగం మరింత జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

హ్యాపీ బర్త్ డే:ఘనంగా రమేష్ బాబు జన్మ దిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment