38.7 C
Hyderabad
May 7, 2024 16: 38 PM
Slider నిజామాబాద్

బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేదు

#brsparty

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు జిల్లాలను తాకుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ లో ఎంపీపీ, జడ్పీటీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదని, అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ఓ వైస్ ఎంపీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ప్రజలు కోరుకుంటే తన పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం వైస్ ఎంపీపీ రాజీనామా అంశం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని సదాశివనగర్ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గుర్తింపు లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఎంపీపీ మాట్లాడారు. అంతర్గత విభేదాలతో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. పార్టీలో ఎంపీపీ, జడ్పీటీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ప్రజల అభీష్టం మేరకు ప్రజలు రాజీనామా చేయమంటే వైస్ ఎంపీపీ పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తనను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు చెబితే పదవికి సైతం రాజీనామా చేస్తానని  పేర్కొన్నారు.

Related posts

గాంధర్వగానం

Satyam NEWS

మూడేండ్ల‌లో నియామ‌కాలెన్ని ?

Sub Editor 2

మేం పాఠాలు చెప్పం… ఆ విషయం బయటకు తెలిస్తే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment