40.2 C
Hyderabad
May 6, 2024 18: 30 PM
Slider హైదరాబాద్

అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

#kapra

ఉప్పల్ నియోజకవర్గం  కాప్రా సర్కిల్లో పని జరగాలన్న, ఫైలు ముందుకు పోవాలన్న చేతులు తడపాల్సిందే. అదే టౌన్ ప్లానింగ్ సెక్షన్ (టీపీఎస్), జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తుంది. ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో పనితీరు అధ్వానంగా మారిందని చెప్పవచ్చు.

టౌన్ ప్లానింగ్ విభాగం లో అసిస్టెంట్ టౌన్ ప్లానర్ తోపాటు ఇద్దరు టీపీఎస్ లు, ము గ్గురు న్యాక్ ఇంజనీర్లు, ముగ్గురు చైన్మెన్లు. ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.భ వన నిర్మాణ అనుమతులు మంజూరు చేసి అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన ఈ వి భాగం అవినీతి మయమైందని చెప్పకనే చెప్పవచ్చు.

అక్రమ నిర్మా ణాల విషయం లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆక్రమ నిర్మాణాలను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సిన న్యాక్ ఇంజనీర్లు నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ  చేతులు దులుపుకుంటున్నారు.

ఏసీపీ, టీపీఎస్ లకు సహాయకులుగా పనిచేయాల్సిన చైన్మెన్లు అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తు చక్రం తిప్పుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బం దితో కలిసి వసూళ్లకు పాల్పడుతు న్నారని ఆరోపణ ఉన్నాయి. టీపీఎస్ లను డమ్మీలుగా చేసి ఏసీపీ, న్యాక్ ఇంజనీర్లు, చైన్మెన్లు,ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది హవా చలాయిస్తున్నారు. 

జోనల్ అధికారుల అండదండలతో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని  చెప్పకనే చెప్పవచ్చు.కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్, కాప్రా, హెచ్ బీ కాలనీ డివిజన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మా ణాలు జరుగుతున్నాయి.

స్టిల్ను మొత్తం పార్కింగు వదల కుండా అందులో గదులు, షట్టర్లు నిర్మిస్తున్నారు.వాటిపై పెంట్ హౌజ్లు కూడ వేస్తున్నారు.సెల్లార్ల విషయం చెప్పాలనే చెప్పవచ్చు.కొన్ని ప్రాంతాల్లోనైతే అనుము తులు లేకుండానే భవనాలు,షెడ్లు నిర్మిస్తున్నారు.ఆక్రమ నిర్మాణాల నియంత్రణ కోసం ఏర్పాటుచేసిన స్పె షల్ టాస్క్ ఫోర్స్ ఆశించిన ఫలితాలు రావడంలేదు.

జోనల్ కమిషనర్ ఆజమాయిషీలో పనిచేయాల్సిన ఈస్పెషల్ టాస్క్ ఫోర్స్ అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో పూర్తిగా విఫల మైంది. ఇప్పటి కైన టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టి అక్రమ నిర్మా ణాల నియంత్రణకు, వెంటనే గ్రేటర్ కమిషనర్ తగిన చర్యలు తీసుకో వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న, స్ధానిక ప్రజాప్రతినిధులు

ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, అధికారుల అలసత్వంతోనే కాప్రా సర్కిల్ పరిధిలో ఆక్రమనిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతుంది. సర్కిల్ పరిధిలో ఇష్టారాజ్యంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు కొందరికి కాసులవర్షం కురిపి స్తుండగా, మరికొందరికి ఆదాయ వనరులుగా మారుతున్నాయి.

ప్రజాప్రతినిధుల అనుచరులు అక్రమనిర్మాణాలే టార్గెట్ గా పనిచేస్తు అందిన కాడికి దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్న నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల నియంత్రణకోసం ఏర్పాటుచేసిన స్పె షల్ టాస్క్ ఫోర్స్ తో సైతం ఆశించిన ఫలితాలు రావడం లేదు.

జోనల్ కమిషనర్ ఆజమాయిషీలో పనిచేయాల్సిన   స్పెషల్ టాస్క్ ఫోర్స్ అక్రమనిర్మాణాలను అరికట్టడంలో పూర్తిగా విఫల మైందిని,  టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టి అక్రమ నిర్మా ణాల నియంత్రణకు  గ్రేటర్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

మరో సారి రణరంగం గా మారిన ఓయూ ఆర్ట్స్ కళాశాల

Satyam NEWS

వైభవంగా గృహాలలో వరలక్ష్మీ నోములు

Satyam NEWS

మహిళలకు నరకం చూపిస్తున్న గ్రామ సమైక్య సంఘం

Satyam NEWS

Leave a Comment