27.7 C
Hyderabad
May 11, 2024 08: 11 AM
Slider సంపాదకీయం

పొలిటికల్ వీడియో: గుండెలు పిండేసి మోడీని ఎండేసి

#Viral Video

అదిగో పులి అని ఎవడో ఎగతాళికి అంటే నేను చూశాను ఇదిగో తోక అన్నాడట వెనకటికి ఎవడో. అలానే ఉంది ఈ కథ. ఎవరో ఒక అమ్మాయి ఒక పసి బిడ్డను ఎత్తుకుని రైలు రెండు బోగీలు కలిసే చోట కూర్చుని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి గత రెండు రోజులుగా వైరల్ అవుతున్నది.

ఈ వీడియో చూస్తే నిజంగా గుండె గుభిల్లుమంటుంది. అందులో సందేహం లేదు. ఆ అమ్మాయి ఎక్కడ పడిపోతుందో, ఆ అమ్మాయి చేతిలోని పసిబిడ్డ ఏమైపోతుందో ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నదో కారణం ఏమిటో అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి.

పాలకులపై కోపం రాక తప్పదు

నిజంగా ఈ దేశంలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయా అంటూ పాలకులపై కోపం వచ్చినా తప్పు లేదు. ఈ వీడియో చూడగానే పైన చెప్పిన అన్ని ఫీలింగ్స్ కలిగాయేమో తెలియదు కానీ హైదరాబాద్ తూర్పు డిసిపి ఎం రమేష్ కూడా ఇలానే స్పందించారు.

‘‘ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు నా మనస్సు తల్లడిల్లింది నీ అవస్థ చూసి ఎందుకు ఈ అభివృద్ధి ఎందుకు ఈ సంపద నాకు దుఖ: ఆగడం లేదు. అన్నీ ఉన్నా నీకేమీ చేయలేకపోతున్నా క్షమించు తల్లీ’’ అంటూ చేతులు జోడించి ఆయన నమస్కరించారు.

జర్నలిస్టు గుండె కూడా కదిలిపోయింది పాపం

కరడుకట్టిన పోలీసు అధికారులు కూడా ఇంత మానవీయ కోణంతో స్పందిస్తే ఈ దేశానికి ఇక కావాల్సింది ఏముంది? కట్ చేస్తే. డిసిపి రియాక్షన్ చూసిన ఒక పత్రిక విలేకరి గుండె తరుక్కుపోయింది. ఐపీఎస్ అధికారి అయిన వ్యక్తి ఇంత స్పందిస్తే మరి నేనెంత స్పందించాలని అనుకున్నాడు సదరు జర్నలిస్టు.

పెన్ను పేపర్ తీసుకుని రాసేశాడు….. కరోనా సమయంలో లక్షలాది మంది వలసకూలీలు తరలిపోతున్నారని, రైల్లో స్థలంలేక ఇలా ఒక బాలింత అతి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నదని, దీన్ని చూసి సాక్ష్యాత్తూ మన డిసిపిగారే చలించిపోయారని ఓ వార్త రాసేశాడు.

ఇదే వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో అదే నిజమనుకున్నారు. ఎవరికి వారు హృదయం విప్పి తమ ఫీలింగ్స్ చెప్పేస్తున్నారు తప్ప ఈ వీడియో ఎక్కడికి? ఎవరిది? నిజమా కాదా అని తెలుసుకోలేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వలసకూలీల విషయంలో దారుణంగా విఫలమైందని వామపక్షాలు చేస్తున్న ఆందోళన మనకు తెలిసిందే.

ఈ వీడియో వెనుక అసలు విషయం ఇదీ

ఆ క్రమంలో ఇలాంటి వీడియోలు, వ్యాఖ్యానాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ వీడియోలు వ్యాఖ్యానాలు చూసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలం అయింది అని అందరూ అనుకోవాలన్నమాట. వాస్తవం ఏమిటంటే ఈ వీడియో లాక్ డౌన్ సందర్భంగా వలస కూలీలది కాదు. ఈ వీడియో 2016 సంవత్సరంలోనిది. అదీ కూడా మన దేశంలోనిది కాదు. ఇది బంగ్లాదేశ్ కు సంబంధించిన వీడియో. ఆ అమ్మాయి, చిన్ని పిల్లను చేతిలో పట్టుకుని కూర్చున్న తీరు బాధ కలిగించేదే కానీ ఈ బాధాకరమైన వీడియోను కూడా మోడీ ఇమేజిని తగ్గించడానికి వాడుకునేవారిని ఏమనాలి?

Related posts

బక్కోడి చేతికి బందుకు పట్టించిన సాయుధ పోరాటం

Satyam NEWS

ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమాలే – సీఐటీయూ

Bhavani

ఢిల్లీకి వెళుతున్న వై ఎస్ షర్మిల

Satyam NEWS

Leave a Comment