19.7 C
Hyderabad
December 2, 2023 05: 13 AM
Slider సినిమా

కృతిశెట్టికి బంపర్ ఆఫర్

#Kriti Shetty

‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ కేటగిరీలో కి వెళ్ళిపోయిన కృతిశెట్టి కి ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. ఉప్పెన తర్వాత ఆమెకు విజయాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీ విజయాలే కీలకం. అందం, అభినయం ఎంత వున్నా విజయాలు రాకపోతే ఒక నెగిటివ్ ముద్రపడిపోతుంది. ఇప్పుడు కృతి శెట్టి విజయంలో కూడా అదే జరిగింది.

ఉప్పెన తర్వాత చేసిన బంగార్రాజు, వారియర్, మాచర్ల, ఆ అమ్మాయి గురించి, కస్టడీ ఫ్లాపులే. మధ్యలో శ్యామ్ సింగారాయ్ సినిమా ఉన్నప్పటికీ అందులో కృతిశెట్టి ఒక హీరోయిన్ అని ఎవరికీ గుర్తుండదు కూడా. ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవికి వెళ్ళిపోయింది. వరుస అపజయాల ప్రభావంతో కృతికి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

ఇప్పుడు కృతి ఖాతాలో ఓ మలయాళం సినిమా తప్పితే మరొకటి లేదు. ఇలాంటి సమయంలో ఓ ప్రామెసింగ్ ఆఫర్ ఆమె తలుపు తట్టింది. శర్వానంద్ హీరో శ్రీరాం ఆదిత్య తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేశారు. శర్వా, కృతి కలిసి నటించడం ఇదే తొలిసారి. గ్రాఫ్ డౌన్ అయిపోతున్న సమయంలో ఈ ఆఫర్ ఆమెకు మళ్ళీ బూస్ట్ ఇచ్చినట్లయింది.

Related posts

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Satyam NEWS

నాగర్ కర్నూల్ పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

Bhavani

విజిలెన్స్ కార్యాలయం ప్రారంభం

Bhavani

Leave a Comment

error: Content is protected !!