31.2 C
Hyderabad
May 3, 2024 02: 28 AM
Slider ముఖ్యంశాలు

అక్రమ మద్యం రవాణాను అరికట్టాలి

#Minister V. Srinivas Goud

తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కర్నాటక, ఏపి, గోవా రాష్ట్రాల నుంచి ఇటీవల అక్రమంగా మద్యం రవాణా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎక్సైజ్ అధికారులు నియంత్రణకు మరింత గట్టిగా వాహన తనిఖీలను చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం టైరోడ్డు వద్ద ఎక్సైజ్ శాఖ చెక్ పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంత్రి వెంట మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పి.నర్సింహాగౌడ్, నాయకులు కె.ఎల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, బండారి ఆనంద్ తదితరులు ఉన్నారు.

Related posts

ప్రత్యామ్నాయం పరిశీలించాలి

Sub Editor 2

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS

అటవీ, రెవిన్యూ భూముల సమస్య పరిష్కరించాలి

Bhavani

Leave a Comment