31.7 C
Hyderabad
May 2, 2024 07: 16 AM
Slider ఖమ్మం

ప్రత్యామ్నాయం పరిశీలించాలి

alternative should be considered

నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి ప్రాజెక్టు పర్యావరణానికి హానికరమైనదని, ప్రత్యామ్నాయ ప్రతిపాదన లు పరిశీలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మం మంచికంటి  భవన్ లో తకెళ్ళపాటి భద్రయ్య అధ్యక్షతన జరిగిన  రైతు సంఘాల, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్పోరేట్ సంస్థలు ప్రయోజనాల కోసం రైతుల భూములను బలవంతంగా సేకరణ చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు ప్రత్యామ్నాయ ప్రతిపాదన లు పరిశీలించాలని డిమాండ్ చేశారు.

రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తున్న అని  చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి  గ్రీన్ ఫీల్డ్   జాతీయ రహదారుల నిర్మాణం లో భూములు కోల్పోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా అన్యాయం చేయడం దుర్మార్గం చర్య అన్నారు.  ఖమ్మం జిల్లా లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు, ప్రభుత్వం  నిరుపేద, దళితులు సాగు భూములను ల్యాండ్ పూలింగ్ చేయడం పై జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించాలి అని డిమాండ్ చేశారు.

 సమావేశంలో ప్రజాపంధా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు సింగు నరిసింహారావు,  భూ నిర్వాసితుల నాయకులు నవీన్ రెడ్డి, వేములపల్లి సుధీర్, కిషన్ రావు, సత్యనారాయణ, నాగళ్ళ శ్రీధర్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు ముక్కర శేఖర్ గౌడ్ దొండపాటి రమేష్, ఆవుల వెంకటేశ్వరరావు, పుల్లారావు, వెంకటయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

అబద్ధాలు చెప్పడం కాదు మోడీతో వెయ్యి కోట్లు ఇప్పించు

Satyam NEWS

22న రాజ్యసభ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

Satyam NEWS

ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌

Sub Editor

Leave a Comment