29.7 C
Hyderabad
May 2, 2024 04: 39 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ప్రారంభం

#Y.S. Jagan Mohan Reddy

అంతర్జాతీయ, జాతీయ పర్యటకుల తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడం తోపాటు వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లను ఏర్పాటు చేశారు. ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను 20 పర్యాటక ప్రాంతాలలో మొదటి విడతగా ఏర్పాటు చేశారు.

టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభమయ్యే ప్రదేశాలు:

విశాఖపట్నం – RK బీచ్, కాకినాడ – కుక్కుటేశ్వర దేవాలయం, తూర్పుగోదావరి – పుష్కరఘాట్, ఏలూరు- ద్వారకా తిరుమల, కృష్ణ – సుబ్రమణ్య స్వామి ఆలయం – మోపిదేవి మరియు మంగినపూడి బీచ్, నెల్లూరు – మైపాడు బీచ్, పెంచలకోన దేవాలయం, కర్నూలు – మంత్రాలయం దేవాలయం, నంద్యాల – మహానంది ఆలయం మరియు అహోబిలం ఆలయం, అన్నమయ్య – హార్సిలీ హిల్స్, YSR – గండికోట కోట మరియు వొంటిమిట్ట దేవాలయం, ఎన్టీఆర్ – పవిత్ర సంగమం ఘాట్ , భవానీ ద్వీపం మరియు కనకదుర్గ ఆలయం, శ్రీ సత్యసాయి – లేపాక్షి దేవాలయంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలు.

టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ వద్ద సిబ్బంది:

ప్రతి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లో 6 మంది పోలీసు సిబ్బంది షిఫ్ట్ కి ఇద్దరు చొప్పున ఎనిమిది గంటలు లేదా షిఫ్ట్ కి ముగ్గురు చొప్పున 12 గంటలు టూరిస్ట్ ప్రదేశం లో విధులు నిర్వహిస్తారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ వద్ద పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది 1:1 నిష్పత్తిలో విధులు నిర్వహిస్తారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ వద్ద పర్యాటకులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్నిఅందిస్తారు.

ఈ కరపత్రంలో అత్యవసర సమయంలో వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ను ముద్రించారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లో రేడియం జాకెట్స్, బెటన్స్ మొదలగునవి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా పర్యాటకులు ఎక్కువగా ఉండే విశాఖపట్నం ఆర్‌కే.బీచ్ వద్ద స్థానికుల సంస్థ సహకారంతో సిబ్బంది పెట్రోలింగ్ కొరకు అదనపు మోటార్ బైక్ ల తో పాటు మినీ ట్రాక్టర్లను సైతం గస్తీలో వినియోగించడం జరుగుతుంది.

ఈ సందర్బంగా డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై‌ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రం లోని వివిధ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తొలివిడతలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ వర్చువల్ గా క్యాంప్ కార్యాలయం నుండి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రదేశాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లను ఏర్పాటు చేసేందుకు డిజిపి పర్యవేక్షణ లోని ఏపీ పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ల పనితీరును ముఖ్యమంత్రి కి వివరించారు.

పోలీస్ శాఖను అభినందించిన ముఖ్యమంత్రి:

నా దృష్టికి వచ్చిన మరో మంచి విషయం ఏమిటంటే…టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మంది మహిళలు ఉన్నారు. దీనివల్ల ఎవరైనా మహిళలు ఆ కియోస్క్‌లకు వెళ్లినప్పుడు వారికి మహిళా సిబ్బంది తోడుగా నిలబడతారు. ఇవన్నీ మంచి పరిణామాలు. వీటన్నింటి వల్ల పర్యాటకులందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ పోలీస్‌ స్టేషన్ లో పనిచేసే వారు అంకిత భావంతో, సేవా భావంతో పనిచేయాలని కూడా ఆకాంక్షిస్తూ… ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేస్తున్నందుకు… నా తరపున, ప్రభుత్వం తరపునుంచి కూడా మనసారా మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తున్నాను అని తెలిపారు.

టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ సిబ్బందికి శిక్షణ: –

టూరిస్ట్ పోలీస్ కియోస్క్‌లో విధులు నిర్వహించే సిబ్బంది, పర్యటనకు వచ్చే సందర్శకుల తో ఏ విధంగా వ్యహరించాలి, వారికి ఎటువంటి సహాయాన్ని అందించాలి, విధులు నిర్వహిస్తున్న సమయంలో పర్యటకుల పట్ల తీసుకోవాల్సిన భద్రత, జాగ్రత్తలు, విపత్కర పరిస్థితుల్లో పర్యటకులను సురక్షితంగా రక్షించడం, పర్యటక ప్రదేశం పైన పూర్తి అవగాహన కలిగి ఉండే విధంగా వారికి శిక్షణ అందించడం జరిగింది.

Related posts

రాజధాని కేసుల విచారణ రేపటికి వాయిదా

Satyam NEWS

ఇంతింతై వటుడింతై: డిప్యూటీ స్పీకర్ స్థానికి విజయనగరం వీరుడు

Satyam NEWS

పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్ష మొదలు

Satyam NEWS

Leave a Comment