40.2 C
Hyderabad
May 6, 2024 18: 10 PM
Slider నిజామాబాద్

నిబంధనలకు విరుద్ధంగా బిచ్కుందలో మరో ఆస్పత్రి

#RuralDoctor

కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద మండలాలలో తిరుమల ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో ఆస్పత్రి అదే విధంగా కొనసాగుతున్నది. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివానంటూ బోర్డుపైన రాసుకుని ఒక డాక్టర్ సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఘటన కొనసాగుతున్నది.

మండల కేంద్రానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడి తనయుడు తాను బీఏఎంఎస్(ఎండి) చేశానంటూ బోర్డు తగిలించుకుని  మరి గ్రామీణ ప్రాంత ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ఘటన కొనసాగుతూనే ఉంది. ఈ ఆసుపత్రిలో ఇన్ పేషంట్ల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.

గతంలో ఈ వైద్యుడి నిర్వాకం వల్ల పలువురు తీవ్ర అనారోగ్యానికి గురికాగా పెద్దల అండదండలతో రాజీ కుదిర్చి తప్పుకున్నట్లు సమాచారం. బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు వచ్చి ఎటువంటి చర్యలు చేపట్టకుండానే వెను దిరిగినట్టు సమాచారం.

పిఎంపి వైద్యులు చేయాల్సింది ప్రథమ చికిత్స మాత్రమే. వారు నడిపే కేంద్రానికి కూడా ప్రథమ చికిత్స అని బోర్డు మాత్రమే తగిలించాలి. కానీ ఇక్కడ ఏకంగా హాస్పిటల్ అంటూ బోర్డు తగిలించుకోవడం నిబంధనలకు బేఖాతరు చేసినట్లే. దానికి తోడు ఓ ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్ల తో బేరం కుదుర్చుకుని పరీక్షలు కూడా చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే కరొనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక భౌతిక దూరం పాటించడం అసలే కనపడటం లేదు. మరో అడుగు ముందుకేసి ఏకంగా ఈసీజి లు కూడా చేస్తూ వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికైనా సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి ప్రత్యేక విచారణ చేపడితేగాని ఇతగాడి అక్రమాలు వెలుగులోకి రావు.

Related posts

గోవిందా గోవింద: తిరుమల కొండపై వికటిస్తున్న కొత్త ప్రయోగాలు

Satyam NEWS

విజయనగరం లో శిల్పా రామంకు బస్సు..

Satyam NEWS

స్థిరవేతనదారుల ఉసురు తీస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment