26.7 C
Hyderabad
May 3, 2024 08: 52 AM
Slider ప్రపంచం

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం చేసి వారికి జైలు

#Hafiz Muhammad Saeed

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక సహాయం చేస్తున్నారనే నేరంపై జమాత్ ఉద్దవా సంస్థకు చెందిన ముగ్గురికి లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు 16 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ప్రొఫెసర్ మాలిక్ జఫార్ ఇక్బాల్, హఫీజ్ అబ్దుల్ సలామ్, హఫీజ్ అబ్దుల్ రహమాన్ ముఖ్కీ లను కోర్టు నేరస్తులుగా పేర్కొన్నది.  ఇక్బాల్, సలామ్ లకు లక్షా 70 వేల రూపాయల జరిమానా, ముఖ్కీ కి 20 వేల రూపాయల జరిమానా విధించింది.

లష్కర్ ఏ తొయిబా కు అనుబంధ సంస్థ అయిన అల్ హమద్ ట్రస్టు నుంచి ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ పరిశోధనలో తేలింది. దాంతో కేసును కూలంకషంగా పరిశీలించిన లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్ష విధించింది.

పంజాబ్ ప్రావిన్స్ తదితర ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలపై కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ మొత్తం 23 కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసుల్లో లష్కర్ ఏ తొయిబా సుప్రీం హఫీజ్ ముహమ్మద్ సయీద్ కు ఇప్పటికే జైలు శిక్ష విధించారు.

Related posts

విజయనగరం లో మహాకవి గురజాడ జయంతి…!

Bhavani

వైసీపీ పాలనలో నేరాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

Satyam NEWS

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment