40.2 C
Hyderabad
May 2, 2024 17: 45 PM
Slider నల్గొండ

బిజెపి కి తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మికులు ముందుకు రావాలి

#hujurnagar

కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కార్మిక, కర్షిక ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23,24 తేదీలలో జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమలోని కాంట్రాక్ట్ కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రామాపురంలో జరిగిన కృష్ణపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యాదగిరి రావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను,నాలుగు కార్మిక కోడ్ లు గా మార్చడం అన్యాయమని తక్షణమే ఈ 4 కోడ్ లను రద్దు చేయాలని,వీటితో పాటు సిమెంట్ పరిశ్రమలలో వేజ్ బోర్డు ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23,24 తేదీలలో జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమ్మెలో రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపికి వ్యతిరేకంగా సమ్మెకు మద్దతు ఇవ్వాలని,ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలని కోరారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుదలతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని,ప్రజలు కూడా పోరాటాలకు సమాయత్తమై ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్,జిల్లా కమిటీ సభ్యుడు వటైపు సైదులు,ఎస్.కె రణమియా, లకావత్ బాలాజీ నాయక్,ప్రియ సిమెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శి తీగల శ్రీను,వీరబాబు, కాంతారావు,రామారావు,మరియదాసు, మల్లయ్య,లింగారెడ్డి,రామ సైదులు, చలమయ్య ఇతర పరిశ్రమ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శనేత ఎన్టీఆర్

Satyam NEWS

పాకిస్తాన్ కు అమెరికా భారత్ సంయుక్త గ్రూప్ హెచ్చరిక

Satyam NEWS

కేజీబీవీ స్కూల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment