33.2 C
Hyderabad
May 12, 2024 14: 58 PM
Slider విజయనగరం

నాటుసారా నిర్మూలనకు విస్తృత దాడులు చేపట్టాలి

#vijayanagarampolice

నాటుసారా, గంజాయి కేసుల్లో మూలాలను వెలికితీసి, బాధ్యులను ప్రధాన నిందితులుగా చేర్చాలని విజయనగరం జిల్లా ఎస్ పి ఎం.దీపిక ఆదేశించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లులోను, ఎస్.ఈ.బి. స్టేషన్లుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎక్సైజ్ మరియు ఎన్.డి.పి.ఎస్. కేసులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక  జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ జిల్లాలో నాటుసారాను సమూలంగా నిర్మూలించేందుకు విస్తృతంగా దాడులు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నాటుసారా తయారీ, అక్రమ రవాణ, అమ్మకాలు సాగించే వ్యక్తులను, గ్రామాలను గుర్తించి, చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో బెల్లం ఊటలను గుర్తించి, ధ్వంసం చేసే కేసుల్లో నిందితులను గుర్తించాలని, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.

గతంలో గంజాయి, నాటుసారా అక్రమ రవాణలో అరెస్టు కాబడిన నిందితులను విచారణ చేసి, అక్రమ రవాణ మూలాలను గుర్తించి, అందుకు బాధ్యులైన వారిని కూడా ఆయా కేసుల్లో ప్రధాన నిందితులుగా చేర్చాలన్నారు. నాటుసారా తయారీకి ముడి పదార్థాలుగా వాడే నల్ల బెల్లంను విక్రయించే వ్యాపారులను గుర్తించి, వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

ఎస్.ఈ. బి. , స్థానిక పోలీసులు, ఏపీఎస్పీ మరియు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులతో సంయుక్తంగా దాడులు నిర్వహించాలని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గతంలో నిందితులుగా ఉన్న వారు మళ్ళీ నాటుసారా రవాణ, తయారీ, అమ్మకాలు చేపట్టకుండా మంచి ప్రవర్తనతో జీవించేందుకు బైండోవరు చేయాలన్నారు.

గంజాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలు, ఫోను నంబర్లు, ఆధారంగా నిందితులను గుర్తించాలని, వారిని కేసుల్లో నిందితులుగా చేర్చి, వారిపై త్వరితగతిన అభియోగ పత్రాలను న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. జిల్లాలో నాటుసారాను సమూలంగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని, నాటుసారా తయారీ, అమ్మకాలు, అక్రమ రవాణకు పాల్పడేవారిలో పరివర్తన తీసుకొని వచ్చే విధంగా ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అనంతరం, దర్యాప్తులో ఉన్న ఎన్.డి. పి.ఎస్. కేసులను సమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ దీపిక పలు సూచనలు చేసారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్.ఈ. బి. అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, సీఐలు రుద్రశేఖర్, డి.రమేష్, శోభన్ బాబు, ఎం.నాగేశ్వరరావు, బాల సూర్యారావు, సింహాద్రినాయుడు, పి.శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలు మరియు ఇతర ఎస్.ఈ.బి. అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కరోనా ఎఫెక్ట్: ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు

Satyam NEWS

సుప‌రిపాల‌న ఏంటో చూపిన మ‌హానేత‌ అట‌ల్ బిహారీ వాజ్ పేయి

Satyam NEWS

కాంగ్రెస్ ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

Bhavani

Leave a Comment