28.7 C
Hyderabad
April 28, 2024 11: 01 AM
Slider క్రీడలు

కొల్లాపూర్ మినీ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు కావాలి

#sports

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మినీ స్టేడియంలో క్రీడాకారులు మరియు వాకర్స్ సౌకర్యార్థం లైటింగ్ ఏర్పాటు చేయాలని కొల్లాపూర్ పట్టణ క్రీడాకారుడు కలర్ మహేష్ కోరారు. ఈ మేరకు ఆయన నేడు హైదరాబాద్ లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందచేశారు.

సూర్యాస్తమయం తరువాత వెలుతురు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తున్నదని క్రీడాకారులు కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి ని కలసి చెప్పారు. ఆయన వెంటనే  సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్టేడియం నిర్వహణ ను మున్సిపల్ పరిధిలోకి తీసుకురావాలని సాట్స్(SATS) చైర్మన్ ని కోరారు.

అందులో భాగంగానే నేడు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని కలర్ మహేష్  కలిశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పంపిన లెటర్ ను సాట్స్ చైర్మన్ కి ఆయన అందచేశారు.

Related posts

హెల్తీ హార్ట్: గుండె జబ్బులు పెరగడానికి కారణాలెన్నో

Satyam NEWS

తక్షణమే వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలి

Satyam NEWS

టెర్రిఫిక్:ఆప్ఘనిస్తాన్ విమాన ప్రమాదం 83 మంది మృతి?

Satyam NEWS

Leave a Comment