ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి భైరవ సింగ్ షెకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు తెలిపారు.
వారు బిజెపి అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అన్న మాట గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పిఆర్ సి అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ,టీచర్స్ ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభకు ఆయన నేడు హాజరయ్యారు.
మాజీ MLC పాతూరి సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ నాలుగు మూలలా నాలుగు మల్టీ స్పెషల్ హాస్పిటల్ రానున్నాయని మంత్రి వెల్లడించారు. అదే విధంగా దేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మోడల్ స్కూళ్లు నడుస్తున్నాయని ఆయన వివరించారు.
దేశంలో రైతులకు నీళ్లు, ఉచిత విద్యుత్, సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని మంత్రి హరీష్ రావు అన్నారు.