23.2 C
Hyderabad
May 8, 2024 02: 00 AM
Slider ఖమ్మం

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి

#machines

మారుతున్న యుగానికి అనువుగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని కుటుంబ పోషణలో మహిళలు ఆలంబనగా నిలిచేందుకు శిక్షణ అనంతరం  కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం  ఆద్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్  ద్వారా  18 మంది ఎస్సీ నిరుద్యోగ మహిళలకు 3 నెలల కాలవ్యవధిలో కుట్టు మిషన్ యందు ఉచిత శిక్షణ నిర్వహించి వారికి కుట్టు మిషన్ల పంపిణీ చేసినట్లు చెప్పారు.  ఎన్నో రకరకాల డిజైన్లు వచ్చాయని వాటిలో నైపుణ్యాన్ని సాధించాలని చెప్పారు. ఈ సందర్భంగా నాక్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో  ఎస్సి కార్పొరేషన్ ఈడి కె సంజీవ రావు,   నాక్ ఏడి హసీబ్,  ఎస్సి కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపి భవన్ లో ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డు తొలగింపు

Satyam NEWS

మంగళ్ హాట్ లో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

Leave a Comment