28.7 C
Hyderabad
May 5, 2024 07: 52 AM
Slider వరంగల్

కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

#bhupalapally

కోవిడ్-19 నిబంధనలతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రతి ఏటా నిర్వహించుకునే మాదిరిగానే ఈసారి కూడా జిల్లాలో స్వాతంత్ర వేడుకల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని, వేడుకల నిర్వహణకు ఆయా శాఖల ద్వారా నిర్వహించాల్సిన విధులను అప్పగించడం జరిగిందని కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం నుండి స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఆదేశాలు వచ్చిన వెంటనే ఆదేశాల ప్రకారం కోవిడ్-19 నిబంధనలతో వేడుకలు నిర్వహించాలని అన్నారు.

అలాగే కలెక్టర్, ఎస్పీ, జిల్లా పరిషత్ తదితర కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రంలో వివిధ జంక్షన్ లను విద్యుద్దీపాలతో అలంకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఈఓ హైదర్ హై, భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, సిపిఓ కే.సామ్యూల్, డిఆర్డిఓ పురుషోత్తం, జడ్పీ సీఈఓ శోభారాణి, ఎడి సర్వే ల్యాండ్ ఆర్.సుదర్శన్, డిపిఆర్ఓ బి.రవికుమార్, ఇడి ఎస్సి కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయఅధికారి విజయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ రాఘవేందర్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, సూపరింటిండెంట్ మాధవి, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, ఫైర్, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కి “లేడీ” ల‌ను ప‌ట్టుకున్న లేడీ పోలీస్….!

Satyam NEWS

ఘనంగా సంతోషి మాత అమ్మవారికి పూజలు

Satyam NEWS

ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నిర్మాణానికి రూ.20కోట్లు

Satyam NEWS

Leave a Comment