39.2 C
Hyderabad
May 4, 2024 22: 01 PM
Slider ప్రపంచం

చొచ్చుకువచ్చిన చైనా ఇప్పుడు గగ్గోలు పెడుతోంది

#China troops

సరిహద్దుల్లో భారత్ విధ్వంసానికి పాల్పడుతున్నదని చైనా గగ్గోలు పెడుతున్నది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చలకు అనుగుణంగా భారత్ చర్యలు తీసుకోగా చైనా వాటిని ఉల్లంఘించింది.

తూర్పు లద్దాక్ కు చెందిన పాంగాంగ్ ప్రాంతంలోకి చైనా ఆగస్టు 29, 30 తేదీలలో చొచ్చుకువచ్చింది. ఈ విషయాన్ని 31వ తేదీన భారత్ గమనించింది. ఈ మేరకు చైనాను హెచ్చరించింది.

అయితే చైనా తన తప్పుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది తప్ప పాంగాంగ్ ప్రాంతం నుంచి వెనుదిరగలేదు. దాంతో నేడు భారత్ దక్షిణ పాంగాంగ్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నది.

చైనీస్ టవర్ మొత్తాన్ని స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కూల్చి పారేసింది. భారత్ స్వాధీనం చేసుకున్న ఐదు పర్వత శ్రేణులపై పెద్ద ఎత్తున యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ను భారత్  మొహరిస్తున్నది.

అక్సాయిచిన్ లోని 3.5 కిలోమీటర్ల “రిక్విన్ ఏరియా” ను 58 సంవత్సరాల తరువాత భారత్ తిరిగి స్వాధీనం చేసుకున్నది.

Related posts

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

Satyam NEWS

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవం

Satyam NEWS

Leave a Comment