26.7 C
Hyderabad
May 3, 2024 09: 32 AM
Slider నిజామాబాద్

గోదావరి తీర గ్రామాలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

#RiverGodavari

మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసే అవకాశమున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ నిజామాబాదు జిల్లా కలెక్టర్ కు నాందెడ్ జిల్లా కలెక్టర్ వైర్ లెస్ మెసేజ్ పంపారు.

గోదావరితీర గ్రామాలను రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఇటీవల మహారాష్ట్ర లో కురిసిన వర్షాలకు గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ వంటి ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలకు బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ లోకి 70 నుంచి 80  వేల క్యూసెక్కుల వరకు నీరు ఎస్సారెస్పీ లోకి వచ్చి చేరింది.

ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 71  టీఎంసీల నీటి నిలువ ఉంది. మహారాష్ట్ర లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉండటంతో ఎస్సారెస్పీ లోకి వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ లోకి 40 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుంది.

Related posts

మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

Sub Editor 2

సిఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

Satyam NEWS

అందాల శ్రీమతులు ఫ్యాషన్ హుందాలు

Satyam NEWS

Leave a Comment