40.2 C
Hyderabad
April 28, 2024 19: 01 PM
Slider ఆదిలాబాద్

కాగజ్ నగర్ మండలంలో ఘనంగా బలిదాన్ దివస్

#Dr.Kottapally Srinivas

భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతి సందర్భంగా బలిదాన దివస్ ను కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భోరిగం గ్రామంలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాబురావు పాల్గొని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చెలేగా.. నహీ చెలేగా అనే నినాదం ముందుకు తీసుకువచ్చిన మహానాయకుడు ఆయన అని అన్నారు.

దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత అని బాబురావు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛ కోసం పరితపించి జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు కోసం 70 సంవత్సరాల క్రితమే ప్రజా ఉద్యమాలకు నాంది పలికిన వ్యక్తి ఆయన అన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్  రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలకు ఆద్యుడు డాక్టర్ శ్వామ ప్రసాద్ ముఖర్జీ  అని అన్నారు.

జనసంఘ్, బీజేపీల వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదాన దివస్ గా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు JB పౌడెల్, అసిఫాబాద్ ఇంచార్జ్ ఆత్మరం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, బీజేపీ నాయకులు రవి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇంకా, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు కొమురం వందన, జిల్లా ఉప అధ్యక్షురాలు డా.కొత్తపల్లిఅనిత, జిల్లా ఉప అధ్యక్షురాలు రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి మంచిలా నాగమణి, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరభద్ర చారి, మెడి కార్తిక్, పట్టణ మహిళ అధ్యక్షురాలు జాడి శైలేజ, సొల్లు లక్ష్మీ, మాచర్ల శ్రీనివాస్, దిలీప్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

నిర్మల్ జిల్లా కలెక్టర్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam NEWS

ప్రచారంలో ముందున్న…. డాక్టర్ చదలవాడ

Satyam NEWS

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు

Bhavani

Leave a Comment