29.7 C
Hyderabad
April 29, 2024 10: 41 AM
Slider జాతీయం

బాలకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్..

బాలకోట్ హీరో అభినందన్‌‌కు అరుదైన గౌరవం లభించింది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) లోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆయన్ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక్‌కు ఐఏఎఫ్‌ ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత వైమానిక దళంలోని గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో కర్నల్‌ ర్యాంక్‌తో సమానం. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఫిబ్రవరి 27న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.

ఈ క్రమంలో అభినందన్ 51 స్క్వాడ్రన్ తరపున అభినందన్‌ బాంబుల వర్షం కురిపించారు. మిగ్-21తో అభినందన్ పాక్‌ F-16ను పడగొట్టి సంచలనంగా మారారు. ఈ క్రమంలో అభినందన్ పాక్‌ బలగాలకు చిక్కారు. తనపై దాడి జరిగి రక్తం కారుతున్నా అధైర్యపడకుండా.. తాను భారత వింగ్ కమాండర్‌నంటూ పేర్కొన్నారు.

Related posts

రివార్డ్:అమూల్యను హత్య చేస్తే రూ.10 లక్షలు

Satyam NEWS

సైకిల్ పై ఖమ్మం నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

నిజామాబాద్ అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment