30.3 C
Hyderabad
March 15, 2025 09: 27 AM
Slider మహబూబ్ నగర్

బ్యాలెట్ వార్: పార్టీ వలయాలు దాటి స్వతంత్ర అభ్యర్ధిగా చైతన్య

chaitanya 16

పార్టీల పరిధిలో చిక్కుకుపోయిన అభివృద్ధికి స్వేచ్ఛ ప్రసాదిద్దామని కొల్లాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి అవుట చైతన్య పిలుపునిచ్చారు. స్వతంత్రంగా ఆలోచించి మన పాలన మనమే చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

ఎస్ సి రిజర్వుడు నియోజకవర్గమైన 11వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న అవుట చైతన్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె చేస్తున్న ఇంటింటి ప్రచారం పలువురిని ఆకర్షిస్తున్నది. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం!  మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం! ఇతర ప్రాంతాలకు 11వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం! అంటూ చైతన్య వార్డు ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.

కమిషన్లకు ఆశపడకుండా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసుకుంటానని ఆమె చెబుతున్నారు. అధికార పార్టీలో ఉండి వారు చెప్పినట్లు కీలుబొమ్మలా చేయడం కాకుండా స్వతంత్రంగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలో అది చేస్తానని చైతన్య అంటున్నారు. బ్యాటు గుర్తుపై ఓటు వేయాలని ఆమె అభ్యర్ధిస్తున్నారు.

Related posts

రామ్‌ గోపాల్ వర్మను దాచిపెట్టిన హీరో ఎవరు?

Satyam NEWS

సర్పంచ్ భర్త నుంచి నన్ను కాపాడండి

Satyam NEWS

పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment