39.2 C
Hyderabad
April 30, 2024 22: 10 PM
Slider ఖమ్మం

ఉమెన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

#Telangana State Committee

ఉమెన్స్ జూనియర్ కాలేజీలో అదనపు గదులు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నేత్రుత్వంలో ఖమ్మం అర్బన్ ఎమ్మార్వోకి భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో గారికి వినతి పత్రాన్ని అమలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు సంగీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మాటలు చెప్పి మోసపుచ్చుతోందని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు తక్షణమే అందించాలని గురుకులాలు కేజీబీవీలలో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించాలని పెండింగ్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన బిల్లులను తక్షణమే

అందించి మధ్యాహ్న భోజనానికి నిధులను పెంచాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు దోపిడీని అరికట్టాలని మన ఊరు మనబడి మన బస్తి మనబడి పథకాన్ని అన్ని పాఠశాలకు వర్తింపజేయాలని పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను తక్షణమే

విడుదల చేసి కాస్మోటిక్ చార్జీలను పెంచాలని అటువంటి సంక్షేమ హాస్టళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించాలని పలు విద్యారంగా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు స్రవంతి, ఉదయశ్రీ వెంకటలక్ష్మి, స్రవంతి, శిరీష, నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామీణ ప్రాంతాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్ నెట్

Satyam NEWS

వి ఎస్ యూ లో ఘనంగా బాలికల దినోత్సవం

Bhavani

ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

Satyam NEWS

Leave a Comment