29.7 C
Hyderabad
May 2, 2024 05: 21 AM
Slider ఖమ్మం

అంగన్ వాడీ కేంద్రంలో ఒక చిన్నారిపై ఆయా క్రౌర్యం

#girl

అంగన్ వాడీ కేంద్రంలో దారుణం జరిగింది….. ఊహించని విధంగా ఒక ఆయా చేసిన ఈ దారుణం మానవత్వం తలవంచుకునేలే చేస్తున్నది. ఖమ్మం జిల్లా మధిర మండలంలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఆందోళన కలగడం ఖాయం. అక్కడి ఒక చిన్నారి తరచూ మూత్రానికి వెళ్తోందని మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టింది ఓ అంగన్‌వాడీ ఆయా.

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శివాలయం రోడ్డులోని అంగన్వాడీ కేంద్రంలో ఓ అంగన్ వాడీ ఆయా ఓ చిన్నారి తరచూ మూత్రానికి వెళ్తుందని అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారి మర్మాంగంలో గోరుతో గాట్లు పెట్టింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు బాధితురాలిని మధిర పట్టణంలోని ఒక ప్రయివేటు వైద్యశాలకు తరలించారు.

అక్కడ చిన్నారికి చికిత్స నిర్వహిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు మూత్ర విసర్జనకు వెళ్లినా అక్కడి ఆయా తిడుతూ కొడుతూ ఉంటుందని బాధిత చిన్నారి తల్లి ఆరోపించారు. అంగన్‌వాడీ ఆయాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts

మరో అంబేద్కర్ మన కేసీఆర్ : ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

Satyam NEWS

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment